భారత ఆర్మీకి భయపడి చైనా జవాన్లు ఏడుస్తున్నారా? ఇదీ సంగతి!  - MicTv.in - Telugu News
mictv telugu

భారత ఆర్మీకి భయపడి చైనా జవాన్లు ఏడుస్తున్నారా? ఇదీ సంగతి! 

September 24, 2020

ngng

భారత్, చైనా మధ్య గత కొన్ని రోజులుగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. రెండు దేశాల సైన్యం సరిహద్దుల వద్ద  పోటా పోటీగా మోహరిస్తూ తలపడుతున్నారు. ఈ క్రమంలోనే ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందులో చైనా సైనికులు ఏడుస్తూ కనిపించారు. దీనిపై తైవాన్ మీడియా పలు వార్తా కథనాలను కూడా ప్రసారం చేసింది. భారత సైన్యాన్నికి భయపడి ప్రాణాలతో తిరిగి రాలేమని వారంతా ఏడుస్తున్నారని పేర్కొంది. అందుకే ఎల్‌ఏసీ ప్రాంతంలో విధులకు వెళ్తూ బస్సులో కన్నీరు పెట్టుకున్నారని అభిప్రాయపడింది. పీపుల్స్ లిబరేషన్ ఆర్మీలో కొత్తగా చేరిన యువతలో  ధైర్యం ఏ మాత్రం కనిపించడం లేదంటూ ఆక్షేపించింది. 

ఈ వీడియో పై పలు రకాల కథనాలు రావడంతో చైనా స్పందించింది. ఇది సెప్టెంబరు 15న చైనా హుబే ప్రావిన్సులోని పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీకి కొత్తగా ఎంపికైన యువత అభినందన కార్యక్రమం నిర్వహించామని పేర్కొంది. ఆ సమయంలో వారంతా కుటుంబాలను వదిలి విధులకు వెళ్తున్నందుకు కన్నీరు పెట్టుకున్నారని చెప్పింది.  ఏ దేశ సైనికులైనా ఇంటి నుంచి సరిహద్దుకు వెళ్లే సమయంలో భావోద్వేగానికి గురికావడం సహజమని అభిప్రాయపడింది. కాగా ఈ వీడియోలో సైనికులు అంతా ఏడుస్తూనే వణుకుతున్న గొంతులతో వారి సైనిక గీతమైన గ్రీన్‌ ఫ్లవర్స్‌ ఇన్‌ ద ఆర్మీని ఆలపించారు. దీంతో భారత ఆర్మీకి భయపడే ఏడుస్తున్నారనే ప్రచారం జరిగింది. మొత్తానికి చైనా ఆర్మీతో ఈ విషయంపై ఓ క్లారిటీ వచ్చేసింది.