భారత్.. చైనాల మధ్య యుద్ధాల సంగతేంటో కానీ.. జనాభా వార్ జరుగుతూనే ఉంటుంది. అయితే 61యేండ్లలో మొదటిసారిగా చాలా తక్కువ జనాభా నమోదైంది చైనాలో. అందుకే వీర్యదానం చేయమని అక్కడి స్పెర్మ్ బ్యాంకులు కాలేజీ విద్యార్థులను కోరుతున్నాయి.
చైనా జనాభా 61 సంవత్సరాల్లో మొదటిసారి ప్రతికూల వృద్ధిని నమోదు చేసింది. 2022లో 8,50,000 తగ్గింది. జనవరిలో నేషనల్ బ్యూరో ఆఫ్ స్టాటిస్టిక్స్ ఆఫ్ చైనా(ఎన్బీసీ) విడుదల చేసిన అధికారిక డేటా చూపించింది.
ట్రెండింగ్ టాపిక్..
ప్రతికూల జనాభా కారణంగా.. చైనా స్పెర్మ్ బ్యాంకులు కళాశాల విద్యార్థులను, ఆరోగ్యవంతమైన పురుషులు వీర్యదానం చేయాలని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ట్రెండింగ్ టాపిక్ గా మారింది. నైరుతి చైనాలోని యునాన్ హ్యూమన్ స్పెర్మ్ బ్యాంక్ ఫిబ్రవరి 2న కళాశాల విద్యార్థులకు విజ్ఞప్తి చేసింది. ఈ ప్రకటన ప్రయోజనాలు, రిజిస్ట్రేషన్ షరతులు, సబ్సిడీలు, స్పెర్మ్ డొనేషన్ విధానాలను పరిచయం చేసింది. దీంతో పాటు మరికొన్ని స్పెర్మ్ బ్యాంకులు కూడా వారి విజ్ఞప్తులను ప్రకటించాయి.
ఎవరు దానం చేయవచ్చు?
– వీర్యదానం చేసే దాని మీద స్పెర్మ్ బ్యాంకులు సమాధానం ఇచ్చాయి. స్పెర్మ్ బ్యాంక్ ప్రకారం.. దాతలు 20 నుంచి 40 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉండాలి. అంటువ్యాధులు ఉండకూడదు. డిగ్రీ పూర్తయిన వారై ఉండాలి. లేదా చదువుతూనైనా ఉండవచ్చు. దాత ఆరోగ్య పరీక్ష చేయించుకోవాలి.
– అర్హత పొందిన వారు 8 నుంచి 12 సార్లు వీర్యదానం చేయవచ్చునట. వీరికి 4,500 యువాన్ల అంటే సుమారు 5లక్షల రూపాయల పైనే అందుతాయి.
– షాంఘై స్పెర్మ్ బ్యాంకుకు కఠినమైన నిబంధనలున్నాయి. బట్టతల ఉండకూడదు. పొగ తాగిన లేదా మద్యం సేవించిన వారు కూడా ఇందుకు అర్హులు కారు. చూపు సమస్యలు, రక్తపోటుతో బాధపడుతున్నవారు వీర్యదానం చేయడానికి అర్హులు కారు.
2015లో చైనా ఒక బిడ్డ విధానాన్ని ఉపసంహరించుకుంది. దీంతో చాలా జంటలు ఇద్దరు పిల్లలను కనడానికి రెడీ అయ్యారు. అయితే 2021లో మూడవ బిడ్డను కూడా కలిగి ఉండడానికి చైనా ప్రభుత్వం అంగీరించింది. అయితే ఇది జనాభా పెంచలేదు. దీంతో స్పెర్మ్ బ్యాంకులు ఈ నిర్ణయానికి వచ్చి ఈ ప్రకటనను చేశాయి.