Chinese staff who prevented corona patients from going out
mictv telugu

చస్తే చావండి కానీ బయటికి మాత్రం వెళ్లనివ్వం.. వీడియో

September 6, 2022

Chinese staff who prevented corona patients from going out

క్రూరమైన నియంత పాలనకు చైనా మరోసారి ఉదాహరణగా నిలిచింది. అక్కడి ప్రభుత్వం పౌరుల విషయంలో ఎంత కఠినంగా ఉంటుందో కరోనా సమయంలో వచ్చిన వీడియోలు సాక్ష్యంగా నిలిచాయి. వేల కోట్ల ఆస్తులున్న కుబేరులు కూడా తినడానికి కనీసం బ్రెడ్ ముక్క కూడా దొరక్క అవస్థపడ్డ ఘటనలు చూశాం.

ఇప్పుడు అంతకంటే దారుణమైన విషయం వెలుగులోకి వచ్చింది. కరోనా కారణంగా ఆ దేశంలో భయంకరమైన లాక్‌డౌన్ అమలవుతున్న విషయం తెలిసిందే. జీరో కోవిడ్ పాలసీతో పాటు కరోనా సోకిన వారికి ఐసోలేషన్ చాలా కఠినంగా అమలు చేస్తున్నారు. కొన్ని లక్షల మంది ఇలా ప్రత్యేక భవనాల్లో మగ్గుతున్నారు. ఈ నేపథ్యంలో చైనాలోని సిచువాన్ ప్రావిన్స్‌లో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై తీవ్రత 6.8గా నమోదైంది. 2017 తర్వాత ఆ స్థాయి భూకంపం రావడంతో కొండచరియలు విరిగిపడ్డాయి. అనేక భవనాలు నేలమట్టం అయ్యాయి. కనీసం 50 మంది చనిపోగా 100 మందికి పైగా గాయాలయ్యాయి. ఈ క్రమంలో ఐసోలేషన్‌లో ఉన్న కరోనా రోగులు ప్రాణ భయంతో పరుగులు పెట్టారు. ఎవరైనా ఆ సమయంలో ప్రాణాలు దక్కించుకోవడానికి ఆరాటపడడం కామన్. కానీ, అలాంటి ప్రమాదకర పరిస్థితుల్లోనూ అక్కడి సిబ్బంది వారిని వదల్లేదు. భవనం కూలితే ఇందులోనే చావండి తప్ప బయటికి వెళ్లవద్దంటూ అడ్డుకున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సిబ్బంది దురుసు ప్రవర్తనను కొందరు వీడియోలు తీయగా, అక్కడి ట్విట్టర్ హ్యాండిల్స్ నుంచే అవి వైరల్ అయ్యాయి. అటు భూకంప బాధితులకు సాయాన్ని కూడా కరోనా టెస్టులు అయ్యాకే ఇస్తామంటూ చెప్తున్నారంటే ఎంత దారుణమో అర్ధం చేసుకోవచ్చు. అయితే చైనా అధికారులు వీటిపై స్పందించాల్సి ఉంది.