చైనావారి తెలివి.. లాక్‌డౌన్‌లో రోబోలను వదిలి.. - MicTv.in - Telugu News
mictv telugu

చైనావారి తెలివి.. లాక్‌డౌన్‌లో రోబోలను వదిలి..

March 31, 2022

 nggfg

కరోనాతో చైనా దేశం అల్లకల్లోలం అవుతుంది. ప్రస్తుతం ఆ దేశ ప్రజలు కరోనా మహమ్మారితో కొన్ని వారాలుగా మళ్లీ పోరాటం చేస్తున్నారు. చైనాలో కరోనా మహమ్మారి విజృంభిస్తుండడంతో ప్రజలు ఉద్యోగాలు, బిజినెస్‌లను వదిలి ఇండ్లకే పరిమితమైయ్యారు. దీంతో అప్రమత్తమైన చైనా ప్రభుత్వం అనేక నగరాల్లో సంపూర్ణ లాక్‌డౌన్‌ను ప్రకటించింది. ఈ నేపథ్యంలో షాంఘై మహానగరంలో కరోనా వ్యాప్తి పెరిగిపోవడంతో కొన్నిరోజుల కిందట లాక్‌డౌన్ విధించింది.

ఈ నేపథ్యంలో షాంఘై వీధుల్లో ఆసక్తికర దృశ్యం కనిపించింది. నిర్మానుష్యంగా ఉన్న రోడ్లపై అధికారులు రోబోల సాయంతో ప్రచారం నిర్వహించారు. ప్రజలకు ఆరోగ్యపరమైన జాగ్రత్తలు చెబుతూ, ఇళ్లలోనే ఉండాలని, బయటికి రావొద్దంటూ ఒక రోబో హెచ్చరికలు చేసుకుంటూ ముందుకు సాగింది. చైనా భాషలో ఉన్న ఆ ఆరోగ్య ప్రకటనలు రోబో వీపుపై ఉన్న స్పీకర్ లోంచి వినిపించాయి. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతోంది.

 

మరోపక్క రెండు సంవత్సరాలపాటు ప్రపంచ దేశాలను గడగడలాడించిన కరోనా, కొన్ని నెలలుగా తగ్గుముఖం పట్టింది. దీంతో ప్రజలు మళ్లీ సాధారణ జీవితాలకు అలవాటు పడ్డారు. ఈ క్రమంలో భారతదేశంలో కూడా కరోనా తీవ్రత తగ్గుముఖం పట్టింది. ఇటువంటి సమయంలో చైనా దేశంలో కరోనా మళ్లీ విజృంభిస్తుండడంతో యావత్ ప్రపంచ ప్రజలు భయాందోళనకు గురౌతున్నారు.