కరోనా ప్రభావం..మాస్క్ లేకుండా కనిపిస్తే అరెస్ట్! - MicTv.in - Telugu News
mictv telugu

కరోనా ప్రభావం..మాస్క్ లేకుండా కనిపిస్తే అరెస్ట్!

February 5, 2020

dfgh

కరోనా వైరస్ చైనా దేశాన్ని వణికిస్తోంది. ఇప్పటికే ఈ మహమ్మారి కారణంగా చైనాలో దాదాపు 500 మందికి పైగా ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. దాదాపు 20000 మందికి ఈ వైరస్ సోకినట్లు సమాచారం. దీంతో చైనా పక్క దేశాలు చైనాతో సత్సంబంధాలు తెంచుకున్నాయి. చైనా నుంచి ఎవరైనా వస్తే.. ప్రయాణికులకు అందరికీ వైద్య పరీక్షలు చేసిన తరువాతే అనుమతిస్తున్నారు.

చైనాలోని హుబె ప్రావిన్స్‌లోని వుహాన్ నగరంలో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వచ్చేందుకు హడలిపోతున్నారు. ఒకప్పుడు జనసంద్రంగా కనిపించే వుహాన్ నగరం ఇప్పుడు నిర్మానుష్యంగా మారిపోయింది. అవసరం ఉంటేనే తప్ప ప్రజలు బయటకు రావడం లేదు. రోడ్డుపై ఎవరైనా ముఖానికి మాస్క్ లేకుండా కనిపిస్తే పోలీసులు వెంటనే అరెస్ట్ చేస్తున్నారు. చైనాలోని అనేక నగరాల్లో ప్రస్తుతం కర్ఫ్యూ వాతావరణం కనిపిస్తోంది.