Chinese woman living in Delhi disguised as monk arrested on spying charge
mictv telugu

బౌద్ధ సన్యాసిని వేషంలో దేశంలోకి చైనా గూఢాచారి.. అరెస్ట్

October 21, 2022

నకిలీ గుర్తింపు కార్డులతో బౌద్ధ సన్యాసి వేషంలో అనుమానాస్పదంగా తిరుగుతోన్న ఓ చైనా మహిళను అదుపులోకి తీసుకున్నారు ఢిల్లీ పోలీసులు. ఆమె సన్యాసిగా జీవిస్తూ.. డ్రాగన్‌ తరఫున గూఢచర్యం చేస్తుందని పోలీసులు అనుమానిస్తున్నారు. దేశ వ్యతిరేక కార్యకాలపాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలపై చైనా మహిళను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు.

సదరు మహిళ చైనాలోని హెనాన్ ప్రావిన్సుకు చెందిన కైరువోగా గుర్తించారు. బౌద్ధ సన్యాసిని ముసుగులో డోల్మా లామాగా పేరు మార్చుకున్నట్లు పోలీసులు గుర్తించారు. ఉత్తర ఢిల్లీలోని టిబెటన్ శరణార్థుల కాలనీ మజ్ను కాతిలాలో ఆమెను అదుపులోకి తీసుకున్నారు. సంప్రదాయ బౌద్ధ సన్యాసి ధరించే దుస్తుల్లో మహిళ ఉంది. ఆమె నుంచి డోల్మా లామా పేరుతో నేపాల్ పౌరసత్వ ధ్రువీకరణ పత్రాన్ని స్వాధీనం చేసుకున్నారు. అయితే ఫారినర్స్ రీజినల్ రిజిస్ట్రేషన్ ఆఫీసులో విచారించినప్పుడు సదరు మహిళ చైనా పౌరురాలని తేలిందని.. 2019లో భారత దేశానికి వచ్చినట్లు గుర్తించారు. ఫారెనర్స్‌ రీజినల్‌ రిజిస్ట్రార్‌ ఆఫీస్‌ (ఎఫ్‌ఆర్‌ఆర్‌వో) ప్రకారం ఆమె కాయ్‌రో పేరుతో చైనా పాస్‌పోర్టు వాడి 2019లో భారత్‌లోకి ప్రవేశించినట్లు తేలింది. ఆమెపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఇంగ్లీష్, నేపాలీ, చైనీస్ భాషల్లో మహిళ మాట్లాడుతున్నట్లు పోలీసులు వెల్లడించారు.