సిటీ స్కాన్ చూసి డాక్టర్లు షాక్.. మెదడులోకి సూదులు ఎలా వచ్చాయి? - MicTv.in - Telugu News
mictv telugu

సిటీ స్కాన్ చూసి డాక్టర్లు షాక్.. మెదడులోకి సూదులు ఎలా వచ్చాయి?

October 18, 2020

Chinese Woman Shocked After CT Scan Reveals Two Needles Embedded In Her Brain.jp

సిటీ స్కానింగ్ కోసం వచ్చిన ఓ మహిళకు స్కాన్ చేసిన వైద్యులు షాక్ అయ్యారు. యువతి మెదడులో రెండు పొడవైన లోహపు సూదులను చూసి వారి మైండ్ బ్లాంక్ అయిపోయింది. ఎందుకంటై రెండు సూదులు మెదడులో ఉన్నా పైకి మాత్రం ఎలాంటి గాయాలు లేకపోవడం వైద్యులను షాక్‌కు గురిచేసింది. ఈ విచిత్ర సంఘటన చైనాలో చోటు చేసుకుంది. ఒక కారు ప్రమాదం తర్వాత జెంగ్‌జౌకు చెందిన 29 ఏళ్ల మహిళ సిటీ స్కాన్ చేయించుకోగా, ఆమె మెదడులో రెండు పొడవైన సూదులు ఉన్నాయని బయటపడింది. మహిళ సిటీ స్కాన్ నివేదికను చూసి వైద్యుల బుర్రలు వేడెక్కిపోయాయి. ఎందుకంటే ఆమె తలలో ఎక్కడైతే సూదులు ఉన్నాయో అక్క గాయాల సంకేతాలు లేవు. కానీ, సిటీ స్కాన్‌లో మాత్రం మెదడులో సూదులు ఉన్నాయని చూపడంపై వారు విస్మయం వ్యక్తం చేశారు. 

మిషినరీలో ఏమైనా సమస్య ఉందని ఆ దిశగానూ పరిశీలించారు. కానీ వారికి ఎక్కడా అలాంటి సమస్య కనిపించలేదు. వేరే స్కానింగ్ మెషీన్ మీద మరోమారు స్కానింగ్ చేసినా అదేవిధంగా చూపించడంతో వారు అది నిజమని నమ్మాలో అబద్ధం అనుకోవాలో తెలియక డైలమాలో పడ్డారు. రెండు సూదులు 5 సెం.మీ పొడవు, 4.9 మిమీ వ్యాసం కలిగి ఉండి, ఆమె మెదడులో లోతుగా దిగి ఉన్నట్లు గుర్తించారు. 

 

ఇంకో విచిత్రం ఏమిటంటే, కారు ప్రమాదానికి సూదులకు సంబంధమే లేదు అసలు. పైగా సూదులు తలలోకి దిగబడ్డప్పుడు తల మీద గాయాలు ఉండాలి కదా? అలాంటివి ఏమీ లేకపోవడం వారిని తికమకకు గురిచేసింది. ఆమె కూడా తన జీవితంలో తలకు తీవ్రమైన గాయం కాలేదని చెప్పింది. ఆమె తనకు ఎప్పుడూ ఎలాంటి నొప్పి అనుభవించలేదని తెలిపింది. ఆమె సమాధానానికి షాక్ అయి తర్జన భర్జనలు పడ్డ వైద్యులు.. యువతి పసితనంలోనే ఈ సూదులను ఎవరో ఉద్దేశపూర్వకంగానే చొప్పించారని చెబుతున్నారు. ఎందుకంటే పెద్దయ్యాక గట్టిపడిన పుర్రెలో అటువంటి మందపాటి సూదులను చొప్పించడం అసాధ్యమని వైద్యులు అనుమానిస్తున్నారు. ఇలాంటి కేసును తాము ఇంతకు మునుపెన్నడూ చూడలేదని డాక్టర్లు అంటున్నారు. కాగా, సిటీ స్కాన్‌లో వెల్లడైన సమాచారం గురించి మహిళ ఇప్పటికే స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు చైనా వెబ్‌సైట్ సోహు పేర్కొంది. సూదులు ఆమె మెదడులోకి చొప్పించడంపై తనకు కొంతమందిపై సందేహాలు ఉన్నాయని, అయితే ఆమె వెంటనే వారి పేర్లను బయటపెట్టడానికి ఇష్టపడలేదని తెలిపింది.