భాగ్యరాజ్ వ్యాఖ్యలపై చిన్మయి ఆగ్రహం - MicTv.in - Telugu News
mictv telugu

భాగ్యరాజ్ వ్యాఖ్యలపై చిన్మయి ఆగ్రహం

November 27, 2019

Chinmayi is outraged over Bhagya Raja's comments

సినీ దర్శకుడు, నటుడు భాగ్యరాజ్ మహిళలపై చేసిన అనుచిత వ్యాఖ్యలు తీవ్ర దూమారం రేపుతున్నాయి. వివాహేతర సంబంధం కోసం కట్టుకున్న భర్తను, కన్న బిడ్డలను కూడా మహిళలు చంపేస్తున్నారని భాగ్యరాజ్ సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అత్యాచారాలు పెరిగిపోవడానికి మహిళలే కారణమని.. ఒకప్పుడు కట్టుబాట్లతో ఉండే మహిళలు, సెల్ ఫోన్లు వచ్చాక అదుపు తప్పుతున్నారని అన్నారు. ఆయన వ్యాఖ్యలపై మహిళా సంఘాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. భాగ్యరాజాపై చట్ట పరంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. 

ఈ క్రమంలో సినీ గాయకురాలు చిన్మయి శ్రీపాద ఘాటుగా స్పందించారు. మహిళల వల్లే అత్యాచారాలు జరుగుతున్నాయని సినీ పరిశ్రమ పెద్దలు చెప్పడం బాధాకరమని అన్నారు. ఇలాంటి వ్యాఖ్యల వల్లే అమ్మాయిలు చనిపోతున్నారని ట్విటర్ వేదికగా ఆగ్రహం వ్యక్తంచేశారు.