ఇక వీధిలైట్లు ఉండవ్.. కృత్రిమ చందమామల తయారీ - MicTv.in - Telugu News
mictv telugu

ఇక వీధిలైట్లు ఉండవ్.. కృత్రిమ చందమామల తయారీ

October 19, 2018

పౌర్ణమి రాత్రి చందమామ రాగానే ఎంత వెలుతురు వస్తుందో మనందరికీ తెలుసు.. ఒక్క చందమామ వస్తేనే అంత వెలుతురు వస్తే.. ఒక వందా, రెండు వందల చందమామలు వస్తే ఎలా ఉంటుందో ఉహించండి.. ఎంత వెలుతురు వస్తుందో కదా.. పగాలూ రాత్రీ తేడా లేదన్నంతగా.. అప్పుడు కరెంటు కూడా అవసరం లేదు. రాత్రి కూడా పగలుగానే  కనిపిస్తుంది. ఆ రోజు త్వరలోనే రానుంది.

చైనాలో కృత్రిమ చందమామాలను తయారు చేస్తోంది. 2022 కల్లా ఇలాంటి వాటిని మూడింటిని అభివృద్ధి చేసి అంతరిక్షంలోకి పంపనుంది. 2020 వరకు ఈ ప్రాజెక్టు పనులు పూర్తవుతుందని చైనా శాస్త్రవేత్తలు చెప్పారు. దీనికి ప్రధానం కారణం ఏంటో తెలుసా?  వీధుల్లో ట్యూబ్ లైట్లకు బదులు కృత్రిమ చందమామలనే ఏర్పాటు చేయడం.Chinna scientists trying to Launch Satellite moon to space for lighting streets but environmentalists apprehends about day and night cycle and plants ఎలా పని చేస్తుంది?

ఓ భారీ దర్పణాన్ని తయారు చేసి దాన్ని అంతరిక్షంలోకి పంపిస్తారు. దానిపై సూర్యుడి కాంతి పడడడంతో అది ప్రకాశిస్తుంంది. ఆ కాంతి పరావర్తనం చెంది భూమిని చేరుతుంది. పరావర్తన కాంతి  భూమిపై దాదాపు 3,600 నుంచి 6,400 చదరపు కిలోమీటర్ల పరిధిలో విస్తరిస్తుంది. అది చంద్రకాంతి కంటే ఎనిమిది రెట్లు ఎక్కువ. కృత్రిమ చందమామలను భూమి ఉపరితలం నుంచి 500కి.మీ ఎత్తులో ప్రవేశ  పెట్టనున్నారు. మన అసలు జాబిల్లి భూమి నుంచి 3,80,000 కిలో మీటర్ల దూరంలో ఉంటాడు.

కాగా ఇలా చేస్తే రేయింబవళ్ల సహజ చక్రానికి విఘాతం కలుగుతుందని పలువురు విమర్శిస్తున్నారు. కృత్రిమ చందమామ వల్ల మొక్కలు, జంతువులు తమ రోజువారీ క్రియలను జరపలేవని అంటున్నారు. అయితే కృత్రిమ చందమామల నుంచి కాంతి పరావర్తనం చెందే తీవ్రతను, పరిధిని ఎప్పటికప్పుడు మార్చుకోవచ్చని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. భూమి నుంచి చేస్తే ఇది నక్షత్రంలానే కనిపిస్తోందని పేర్కొంటున్నారు.సాధారణంగా రాత్రి పూట వెలుతురు కోసం చాలా విద్యుత్ వినియోగిస్తుంటాం. అయితే ఈ కృత్రిమ చందమామల వాడకం ద్వారా విద్యుత్ చాలా ఆదా చేసుకోవచ్చని శాస్త్రవేత్తలు స్పష్టం చేస్తున్నారు. 50 చదరపు కి.మీ పరిధికి 1.2 బిలియన్ యువాన్‌ల కరెంటును ఆదా చేయొచ్చని పేర్కొంటున్నారు. ఇలాంటి ప్రక్రియను 1990లో రష్యా ‘బ్యానర్’ పేరుతో ప్రయోగం చేసింది. కానీ కొన్ని అనివార్యకారణాలతో ఆ ప్రయోగం నిలిపివేశారు.