కూరగాయలు అమ్ముతున్న చిన్నారి పెళ్లి కూతురు అసిస్టెంట్ డైరెక్టర్  - MicTv.in - Telugu News
mictv telugu

కూరగాయలు అమ్ముతున్న చిన్నారి పెళ్లి కూతురు అసిస్టెంట్ డైరెక్టర్ 

September 29, 2020

bngnb

కరోనా మహమ్మారి అందరి జీవితాలను అస్తవ్యస్థం చేసేసింది. ఉపాధి కోల్పోయి చాలా మంది వేర్వేరు పనులు చేసుకోవాల్సి వస్తోంది. ఇప్పటికే పలువురు ప్రైవేటు టీచర్లు, నటులు జీవనోపాధి కోసం  రకరకాల పనులు చేస్తూ వచ్చారు. తాజాగా పాపులర్ సీరియల్‌కు అసిస్టెంట్‌ దర్శకుడిగా పని చేసిన వ్యక్తికి కూడా కష్టాలు మొదలయ్యాయి. తెలుగులో పాపులార్టీ సంపాధించుకున్న చిన్నారి పెళ్లి  కూతరు సీరియల్ అసిస్టెంట్ డైరెక్టర్ కూరగాయలు అమ్ముతూ దర్శనం ఇచ్చాడు. 

రామ్ వృక్షగౌర్ సినీ రంగంపై ఆసక్తితో ఆ వైపు వచ్చాడు. అనుకున్నట్టుగానే మంచి బ్రేక్ వచ్చింది. హిందీ బుల్లితెరపై హిట్ అయిన బాలికా వధు అనే సీరియల్‌ను  తెలుగులో చిన్నారి పెళ్లికూతురు పేరిట ప్రసారమైంది. దీనికి అతను అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశాడు. ఆ వెంటనే ఓ సినిమాకు కూడా అసిస్టెంట్‌గా చేసే అవకాశం వచ్చింది. కానీ లాక్‌డౌన్ దెబ్బతో సినీ పరిశ్రమలో పనులు ఆగిపోయాయి. దీంతో అతని ఉపాధి కోల్పోయాడు. చేసేదేమిలేక సొంత ఊరు యూపీలోని అజాంగఢ్ వెళ్లిపోయాడు. అక్కడే తన తండ్రి చేసే కూరగాయల వ్యాపారం మొదలుపెట్టాడు. తోపుడు బండిపై వాటిని పొసుకొని వాడ వాడ తిరుగుతూ అమ్ముతున్నాడు.