Chintakayala vijay on ysr congress hindupur mp Gorantla madhav video defamation suit
mictv telugu

గోరంట్ల మాధవ్‌పై 50 లక్షల పరువునష్టం దావా..

August 5, 2022

హిందూపురం వైకాపా ఎంపీ గోరంట్ల మాధవ్ ఓ మహిళతో చేసిన న్యూడ్ వీడియో కాల్ దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే. తన శత్రువులు తన జిమ్ వీడియోకు మార్పులు చేసి ఈ న్యూడ్ వీడియో వదిలారని ఆయన అంటున్నారు. అయితే అది నిజమైన వీడియోనేనని టీడీపీ నేతలు అంటున్నారు. మాధవ్‌పై గతంలో నమోదైన అత్యాచారం, బెదరింపులు, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులను ప్రస్తావిస్తున్నారు. ఈ వీడియో వెనక టీడీపీ నేత అయ్యన్నపాత్రుడు కుమారుడు చింతకాయల విజయ్ హస్తముందని మాధవ్ ఆరోపించారు. దీనిపై మాధవ్ ఘాటుగా స్పందించారు. అంతేకాకుండా తన ప్రతిష్ట దెబ్బతీశాడంటూ రూ. 50 లక్షల పరువు నష్టం దావా కూడా వేసి తన లాయర్ ద్వారా మాధవ్‌కు నోటీసులు పంపారు.
‘ఆ వీడియోతో నాకు సంబంధమే లేదు. మాధవ్ అడ్డంగా బుక్కై మార్ఫింగ్ డ్రామా ఆడుతున్నాడు. మాధవ్ ఏమన్నా ట్రామ్ క్రూజా, ఆయన వీడియోలు చూసి తరించడానికి? ఆ భాగ్యాన్ని చూసి తరించడానికే మేం బతికున్నామా? సిగ్గుతో తలదించుకునేలా నగ్న వీడియోలు చేయడమే కాకుండా మళ్లీ సిగ్గులేకుండా మాట్లాడుతున్నాడు. నన్ను అనవసరంగా ఈ వివాదంలోకి లాగిన మాధవ్‌పై పార్లమెంటు హక్కుల కమిటీకి ఫిర్యాదు చేస్తాను..’ అని విజయ్ అన్నారు.