బడిలో కామాంధుడు.. తోటి టీచర్‌పైనే.. - MicTv.in - Telugu News
mictv telugu

బడిలో కామాంధుడు.. తోటి టీచర్‌పైనే..

February 27, 2020

Chintalapudi

విద్యార్థులకు విద్యాబుద్ధులు భవిష్యతు తారలను తీర్చిదిద్దాల్సిన ఓ ఉపాధ్యాయుడు తోటి ఉపాధ్యాయురాలిని లైంగికంగా వేధిస్తున్న ఘటన పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి ప్రభుత్వ హైస్కూల్‌లో వెలుగు చూసింది. కీచక ఉపాధ్యాయుడి వేధింపులు తాళలేక బాధిత ఉపాధ్యాయురాలు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసింది. వెంకటరత్నం అనే ఉపాధ్యాయుడు గత 5 ఏళ్లుగా చింతలపూడి హైస్కూల్‌లో పనిచేస్తున్నాడు. అదే పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయురాలిని కొన్ని రోజులుగా లైంగికంగా వేధిస్తున్నాడు. ఎన్నిసార్లు హెచ్చరించినా అతడి ప్రవర్తనలో మార్పు రాలేదు.

అతడి వేధింపులను భరించలేక చివరకు ఆమె అధికారులకు ఫిర్యాదు చేసింది. దీంతో జిల్లా విద్యాశాఖాధికారిణి సీవీ రేణుక విచారణకు ఆదేశించారు. జిల్లా విద్యాశాఖకు చెందిన ఆర్‌ఎంఎస్‌ ఏఓ ఎస్‌ సూర్యకుమారి, సీనియర్‌ అసిస్టెంట్‌లు కె రాజకుమారి, కె పావనీల ముగ్గురు సభ్యుల బృందం బుధవారం హైస్కూల్‌కు చేరుకుని విచారణ జరిపారు. ఉపాధ్యాయులు, సిబ్బంది నుంచి వివరాలు సేకరించి నివేదికను జిల్లా విద్యాశాఖాధికారికి అందజేస్తామని ఏవో సూర్యకుమారి తెలిపారు. వెంకటరత్నంపై కఠిన చర్యలు తీసుకోవాలని మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.