టీడీపీ ఎమ్మెల్యే చింతమనేనికి ఆరు నెలల జైలు - MicTv.in - Telugu News
mictv telugu

టీడీపీ ఎమ్మెల్యే చింతమనేనికి ఆరు నెలల జైలు

February 14, 2018

 

నేరం చేసిన వాళ్లు శిక్ష అనుభవించాల్సిందే. మన దేశంలో న్యాయం నత్తనడకన నడుస్తుంది. ఎలా నడిచినా న్యాయం జరిగితే అదే పదివేలు. మాజీ మంత్రి వట్టి వసంతకుమార్‌పై చేయి చేసుకున్న కేసులో టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌కు ఆరు నెలల జైలు శిక్షపడింది. భీమడోలు మేజిస్ట్రేట్ కోర్టు బుధవారం ఈ తీర్పు నిచ్చింది.అలాగే రూ. 5 వేల జరిమానా కూడా వేసింది. 2011లో జరిగిన గ్రామసభలో చింతమనేని అప్పటి మంత్రి వట్టి వసంత్‌కుమార్‌పై చేయి చేసుకున్నారు. ఎంపీ కావూరి సాంబశివరావును కూడా దూషించారు. చింతమనేని గత అసెంబ్లీ ఎన్నికల్లో పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు నుంచి గెలిచారు.