chiranjeevi batman avatar gets a shout out from hollywood stars
mictv telugu

హాలీవుడ్ లో మెగాస్టార్ పై ప్రశంసల వర్షం.. 30ఏళ్ళ తరువాత చిరంజీవి వీడియో వైరల్

November 5, 2022

మెగాస్టార్ చిరంజీవిపై హాలీవుడ్ సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురుస్తుంది. చిరు స్టెప్స్ కి తెల్లోళ్ళు ఫిదా అవుతున్నారు. ‘గార్డియన్స్ ఆఫ్ ద గెలాక్సీ’ దర్శకుడు జేమ్స్ గన్, ‘డెడ్‌పూల్ 2’ నటుడు అలాన్ టుడిక్ వంటి హాలీవుడ్ ప్రముఖులు చిరంజీవి డాన్సులేసిన వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ తెగ పొగిడేశారు. అయితే హాలీవుడ్ స్టార్స్ ని అంతలా ఆకట్టుకున్న ఆ మెగాస్టార్ వీడియో 29ఏళ్ళ క్రితం 1993లో విడుదల అయిన ముఠామేస్త్రి చిత్రం లోనిది కావటం గమనార్హం. చిరంజీవిపై మైకేల్ జాక్సన్ డాన్సులతో పాటు హాలీవుడ్ మూవీస్ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. కథలు తెలుగు నేటివిటీకి దెగ్గరగా ఉన్నా.. తన పాటల్లో మాత్రం ఏదోరకంగా హాలీవుడ్ ఫ్లేవర్ వచ్చేలా చూసుకుంటాడు చిరంజీవి. పాట చరణంలో లుంగీ కట్టుకుని మాస్ డాన్స్ వేస్తే.. పల్లవి వచ్చేసరికి మైకేల్ జాక్సన్ గెటప్ లో స్టెప్పులేస్తాడు. ఇలా తన సాంగ్స్ లో ఏదొక స్పెషాలిటీ ఉంటుంది కాబట్టే 30ఏళ్ళ క్రితం వచ్చిన చిరంజీవి పాటలు ఇప్పటి యూత్ కి కూడా పిచ్చెక్కిస్తాయి. సో అచ్చం మనోల్లానే.. తెల్లోళ్ళు కూడా చిరంజీవి స్టెప్స్ కి సోషల్ మీడియా పుణ్యమాని దాసోహం అంటున్నారు.

 

మెగాస్టార్ ముఠామేస్త్రి సాంగ్ వీడియోని హాలీవుడ్ డైరెక్టర్ జేమ్స్ గన్, నటుడు అలాన్ టుడిక్ దృష్టిని ఆకర్షించింది. “బాట్మాన్‌కి బాలీవుడ్ సమాధానం” అనే శీర్షికతో.. ప్రముఖ హాలీవుడ్ సోషల్ మీడియా ఛానల్ చిరు వీడియోని మొదటగా షేర్ చేసింది. అయితే ఇది బాలీవుడ్‌కు సంబదించిన వీడియో అంటూ క్లిప్‌ను షేర్ చేయడంతో చర్చ ప్రారంభమైంది. ఇది బాలీవుడ్ సాంగ్ కాదు.. పక్క తెలుగు మెగాస్టార్ సాంగ్ అంటూ మన నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఈ వీడియోలో చిరంజీవి బ్యాట్ మెన్ గెటప్ లో క్యాప్డ్ క్రూసేడర్‌గా దుస్తులు ధరించి డాన్స్ చేస్తుంటాడు. ముఠామేస్త్రిలో రోజాతో కలిసి ‘వానా గడియారం’ అనే పాటకు బ్యాట్ మెన్ గెటప్ లో చిరు స్టెప్స్ షేక్ ఆడించేస్తుంటాడు. ఈ వీడియోని హాలీవుడ్ ప్రముఖులు షేర్ చేస్తూ .. “సీజన్ 2 పీస్‌మేకర్ వైబ్స్” అని కొందరు.. “మొదట బ్యాట్‌మాన్, తరువాత ది బ్యాట్‌మాన్ మరియు ఇప్పుడు MR. బాట్మాన్.” అని మరి కొంతమంది హాలీవుడ్ ప్రముఖులు వరుస ట్వీట్స్ చేస్తున్నారు.