చిరంజీవి బ్లడ్ బ్యాంకులో ప్లాస్మా ఉచితం - MicTv.in - Telugu News
mictv telugu

చిరంజీవి బ్లడ్ బ్యాంకులో ప్లాస్మా ఉచితం

September 29, 2020

Chiranjeevi Blood Bank Comes To The Rescue of Poor COVID Patients

కరోనా కష్టకాలంలో సీసీసీ ద్వారా పేద సినీ కళాకారులను ఆదుకున్న టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి మరో సాయానికి సిద్ధపడ్డారు. ఇప్పటికే బ్లడ్ బ్యాంక్ , ఐ బ్యాంక్ ద్వారా చిరంజీవి ఎందరికో సేవ చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా కరోనా బారిన పడిన రోగులకు ఉచిత ప్లాస్మాను తన బ్లడ్ బ్యాంకు ద్వారా అందించేందుకు సిద్దమయ్యారు. తెల్ల రేషన్ కార్డులు, ప్రభుత్వ ఆసుపత్రులలో చికిత్స పొందుతున్న పేద రోగులకు ప్లాస్మాను ఉచితంగా తన బ్లడ్ బ్యాంక్ ద్వారా సరఫరా చేస్తున్నామని మెగాస్టార్ వెల్లడించారు. అర్హులైన ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. 

చిరంజీవి తన సొంత నిధులతో బ్లడ్ అండ్ ఐ బ్యాంక్ ఏర్పాటు చేసి నిర్వహిస్తున్నారు. దీని ద్వారా తెలుగు రాష్ట్రాల్లో ఎంతోమందికి రక్తం దానం చేసి ప్రాణదాతగా నిలిచారు. కాగా, కరోనా సోకి కోలుకున్నవారు ఫ్లాస్మాదానం చేస్తే మరికొంతమందికి ఆయుష్షు పోసినట్లేనని తెలిసిన విషయమే. ఈ క్రమంలో ప్లాస్మా దానం ప్రాముఖ్యతను సంతరించుకుంది. పేదలైన కరోనా సోకిన రోగులకు ఉచితంగా ఫ్లాస్మా దానం చేసేందుకు ముందుకు వచ్చిన చిరును ఆయన అభిమానులు ప్రశంసిస్తున్నారు.