పుట్టెడు కష్టాల్లో ‘పునాదిరాళ్లు’ దర్శకుడు.. సాయం కోసం.. - MicTv.in - Telugu News
mictv telugu

పుట్టెడు కష్టాల్లో ‘పునాదిరాళ్లు’ దర్శకుడు.. సాయం కోసం..

November 16, 2019

మెగాస్టార్ చిరంజీవితోపాటు పలువురు నటులకు తొలి అవకాశం ఇచ్చిన ‘పురాది రాళ్లు’ చిత్ర దర్శకుడు గూడపాటి రాజ్‌కుమార్(75) పరిస్థితి దయనీయంగా ఉంది. పెద్దకొడుకు, భార్య మృతితో కుదేలైన ఆయన ఆర్థిక కష్టాల్లో చిక్కుకున్నారు. అద్దె ఇంట్లో అనారోగ్యంతో జీవితం వెళ్లదీస్తూ ఆపన్నహస్తం కోసం దయనీయంగా ఎదురు చూస్తున్నారు. విషయం తెలుసుకున్న కొందరు ఆయనకు సాయం చేస్తున్నారు. ప్రసాద్ క్రియేటివ్ మెంటర్స్ ఫిలిం మీడియా స్కూల్ మేనేజింగ్ పార్టనర్ సురేష్ రెడ్డి రూ.41 వేలు ఇచ్చారు. మరో నటుడు కాదంబరి కిరణ్ కుమార్ ‘మన కుటుంబం’ తరఫున రూ.25 వేలు అందించారు.

Chiranjeevi.

చిరంజీవి కెరీర్‌కు కీలకమైన ‘పునాదిరాళ్లు’ చిత్రంతోపాటుఈ సమాజం నాకొద్దు’, ‘మన ఊరి గాంధీ’, ‘మా సిరిమల్లెవంటి  పలు సందేశాత్మక చిత్రాలకు రాజ్‌కుమార్ దర్శకత్వం వహించారు. కృష్ణాజిల్లా ఉయ్యూరుకు చెందిన రాజ్‌కుమార్‌ ఉద్యోగంలో 1966లో హైదరాబాద్‌కు వచ్చారు. తొలుత వ్యాయామ ఉపాధ్యాయుడిగా పనిచేశారు. సినిమాలపై ఆసక్తితో  సదరన్‌ మూవీస్‌ స్టూడియోలో చేరారు. ‘సతీ అనసూయ’, ‘రహస్యం’ సినిమాలకు సహాయ దర్శకత్వం వహించాడు. ఆ అనుభవంతో 1978లో ‘పునాదిరాళ్లు’ తీశారు. సినిమాల కోసం ఉన్న డబ్బంతా ఖర్చు చేసి ఉత్తి చేతులతో మిగిలారు. ప్రస్తుతం రెండో కొడుకు వద్ద ఉంటున్నారు. ఇటీవల తీవ్ర అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరారు.