chiranjeevi emotional on pawan kalyan
mictv telugu

బూతులు తిట్టి.. సిగ్గులేకుండా ఇంటికి వస్తే ఎలా ?

January 1, 2023

chiranjeevi emotional on pawan kalyan

ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్, చిరంజీవిల అనుబంధం గురించి అందరికి తెలిసిందే. అన్న నీడలో నటుడు అయిన పవన్.. తనకంటూ సొంత స్టైల్ ని క్రియేట్ చేసుకుని పవర్ స్టార్ గా ఎదిగారు. అయితే సినిమా నుండి రాజకీయాల్లోకి వచ్చి జనసేన పేరుతో కొత్త పార్టీపెట్టి పోరాడుతున్నాడు. ఆంధ్రాలో బలమైన ప్రతిపక్ష నాయకుడిగా.. ఫ్యూచర్ సీఎంగా ప్రజల్లో పేరు తెచ్చుకుంటున్నా.. ఇసుమంతైనా అహంకారం పవన్ కళ్యాణ్ లో ఉండదు. అన్నయ్య అంటే అదే ప్రేమ, అదే అభిమానం, అదే గౌరవం ఉంటుంది. తాను ఇప్పుడు ఇలా ఉండడానికి అన్నయ్య చిరంజీవి, వదిన సురేఖలే కారణమని చాలా సార్లు చెప్పారు పవన్. ఇక తన సపోర్టుతోనే ఈ స్థాయికి చేరాడని తెలిసినా.. సొంత కష్టంతోనే పవన్ నాయకుడయ్యాడని.. తనలో లేని ఎన్నో మంచి లక్షణాలు నా తమ్ముడితో ఉన్నాయని.. నిస్వార్థమైన నాయకుడని అస్సలు వెనకాడకుండా తమ్ముడు పవన్ ని పొగడుతాడు మెగాస్టార్.

అయితే తాజాగా మరోసారి తమ్ముడిపై తన ప్రేమని చాటుకున్నాడు చిరంజీవి. రాజకీయం అనే మురికిలో పవన్ కళ్యాణ్ ఉన్నాడని ఆవేదన వ్యక్తం చేశాడు. పవన్ కళ్యాణ్ చిత్తశుద్ధి, నిజాయితీ ఉన్న వ్యక్తి.. రాజకీయాలనే మురికి కూపంలోకి వెళ్లాడు. అక్కడ ఉన్న మురికిని ప్రక్షాళన చేయాలనుకుంటున్నాడు. ఆ ప్రయత్నంలో కొంత మురికి తనకు కూడా అంటుకుంటుంది. మురికిని తీసేవాళ్లకు మురికి అంటడం సహజమే కదా.. ఒక స్వచ్ఛమైన ప్రయత్నం చేస్తున్నప్పుడు మనం సహకరించాలి.. ప్రొత్సహించాలి. అయితే మితిమీరి వాడిని అనరాని మాటలు అంటున్నప్పుడు బాధ కలుగుతుంది. పైగా పవన్‌ను తిట్టిన వాళ్లు మళ్లీ నా దగ్గరకు వచ్చి పెళ్లిళ్లకు, పేరంటాలకు పిలుస్తారు. రమ్మని బతిమాలతారు. నా తమ్ముడిని అన్ని మాటలు అన్నవాళ్లతో మళ్లీ మాట్లాడాల్సి వస్తోందే.. వాళ్లను కలవాల్సి వస్తోందే అని బాధగా ఉంటుంది.’ అని చిరంజీవి తన తమ్ముడు పవన్‌పై వచ్చే విమర్శలు తనను ఏ విధంగా బాధిస్తాయో వివరించారు.