చిరు ప్రయాణిస్తున్న విమానం అత్యవసర ల్యాండింగ్
మెగాస్టార్ చిరంజీవి ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతిక లోపం కారణంగా అర్థాంతరంగా ల్యాండ్ అవ్వాల్సి వచ్చింది. ముంబై నుంచి హైదరాబాద్ వస్తుండగా శుక్రవారం రాత్రి ‘విస్తారా’ ఎయిర్‌లైన్‌లో ఈ లోపం తలెత్తింది. విమానం టేకాఫ్ తీసుకొన్న అరగంటకే ఈ సమస్య వచ్చింది. అయితే పెలెట్ వెంటనే దాన్ని గుర్తించి తిరిగి ముంబై ఎయిర్ పోర్టులో అత్యవసరంగా ల్యాండ్ అయింది.విమానం సురక్షితంగా ల్యాండ్ కావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
‘విస్తారా’ ఎయిర్ లైన్స్ ముంబై నుంచి 120 మంది ప్రయాణికులతో హైదరాబాద్ బయలుదేరింది. సాంకేతిక లోపంతో అత్యవసరంగా ల్యాండ్ చేశాడు పైలెట్. వెంటనే స్పందించిన ఏటీసీ అధికారులు విమానానికి మరమ్మత్తులు చేశారు. చిరంజీవి ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతిక లోపం వచ్చిందని ఓ ప్రయాణికుడు ఫొటో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. అంతా క్షేమంగానే ఉన్నట్టు చెప్పాడు. వెంటనే ఈ ఫొటోలు వైరల్ కావడంతో ప్రమాదంపై అంతా ఆరా తీయడం ప్రారంభించారు.