అంత్యక్రియల్లో అపశ్రుతి..మెగా ఫ్యామిలీపై తేనెటీగల దాడి - MicTv.in - Telugu News
mictv telugu

అంత్యక్రియల్లో అపశ్రుతి..మెగా ఫ్యామిలీపై తేనెటీగల దాడి

May 31, 2020

nbjkbnhtfyt

కామారెడ్డి జిల్లా దోమకొండ సంస్థాన వారసులు, మాజీ ఐఎఎస్‌ అధికారి కామినేని ఉమాపతిరావు అంత్యక్రియలకు మెగా ఫ్యామిలీ హాజరైన సంగతి తెల్సిందే. ఈ అంత్యక్రియల కార్యక్రమానికి తేనెటీగలు ఆటంకం కలిగించాయి. ఆయన మృతదేహాన్ని బయటకు తీసుకువస్తుండగా తేనెటీగలు ఒక్కసారిగా దాడి చేశాయి. 

ఈ దాడిలో‌ చిరంజీవి, రామ్‌చరణ్ స్వల్పంగా గాయపడ్డారు. వెంకటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది చిరంజీవి, రామ్‌చరణ్‌, అతని భార్య ఉపాసనను ప్రమాదం నుంచి తప్పించారు. కొద్దిసేపటి తర్వాత తేనెటీగలు వెళ్లిపోవడంతో అంత్యక్రియలు కొనసాగాయి. కామినేని ఉమాపతిరావు మనుమరాలే రామ్ చరణ్ భార్య ఉపాసన.