చిరంజీవిని వెండి తెరకు పరిచయం చేసిన ఆ దర్శకుడు ఇకలేరు  - MicTv.in - Telugu News
mictv telugu

చిరంజీవిని వెండి తెరకు పరిచయం చేసిన ఆ దర్శకుడు ఇకలేరు 

February 15, 2020

Chiranjeevi First Movie Director Rajkumar No More

మెగాస్టార్‌ చిరంజీవిని వెండి తెరకు పరిచయం చేస్తూ.. తొలి అవకాశం కల్పించిన దర్శకుడు రాజ్‌కుమార్ కన్నుమూశారు. అనారోగ్యం కారణంగా ఆయన తుదిశ్వాస విడిచారు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఆయన కొంత కాలంగా చికిత్స తీసుకుంటున్నారు. ఆయన పరిస్థితి తెలిసిన చిరు కూడా అపోలో ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించారు. తాజాగా శనివారం ఆయన తన చిన్న కుమారుడి నివాసంలో మరణించాడు. దీంతో విజయవాడలోని ఉయ్యూరులో అంత్యక్రియలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. 

గుడిపాటి రాజ్‌కుమార్‌ చిరంజీవి ఇద్దరూ కలిసి తొలిసారి పునాదిరాళ్లు చిత్రంతో వెండితెరకు పరిచయం అయ్యారు. ఈ సినిమాతో అప్పట్లో మంచి విజయాన్ని సాధించడంతో సినిమా ఏకంగా 5 నందిపురస్కారాలను అందుకున్నారు. తర్వాత కొంత కాలానికి ఆయన టాలీవుడ్ నుంచి దూరం అయ్యారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు ఉండగా.. భార్య, పెద్ద కుమారుడు మరణించడంతో చిన్న కొడుకు వద్ద ఆశ్రయం పొందుతున్నారు. ఆయన మరణంపై పలువురు సినీ ప్రముఖులు విచారం వ్యక్తం చేశారు. 

మెగాస్టార్ చిరంజీవి టాలీవుడ్‌లో అడుగుపెట్టాక సినిమా కొత్త పుంతలు తొక్కాయి. డ్యాన్స్ మేనరిజం ఇలా ఎన్నో వైవిధ్యభరితమైన అంశాలు వచ్చాయి. ఇంతటి స్థాయికి రావడానికి చిరంజీవిని వెండి తెరకు పరిచయం చేసింది పునాదిరాళ్లు సినిమా. ఈ సినిమా ద్వారా ఆయన తెలుగు ప్రేక్షుల ముందుకు వచ్చి అందరికి సుపరిచితులు అయిన సంగతి తెలిసిందే.