‘గాడ్ ఫాదర్’ ట్రైలర్ రిలీజ్.. గాంభీర్యంతో అదరగొట్టిన మెగాస్టార్ - MicTv.in - Telugu News
mictv telugu

‘గాడ్ ఫాదర్’ ట్రైలర్ రిలీజ్.. గాంభీర్యంతో అదరగొట్టిన మెగాస్టార్

September 28, 2022

మెగాస్టార్ చిరంజీవి తాజాగా నటించిన చిత్రం గాడ్ ఫాదర్. ఈ చిత్రం విజయదశమి కానుకగా వచ్చే నెల 5న విడుదలవుతోంది. ఈ నేపథ్యంలో ఏపీలోని అనంతపురంలో ఈ సినిమా ప్రిరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలోనే ఆ చిత్ర ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. ఇందులో చిరంజీవి తన గంభీరమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. రాజకీయాల నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కగా చిరంజీవి పలికిన డైలాగులు ఆయన స్థాయికి తగ్గట్టు డిజైన్ చేశారు.

నేను ఉన్నంత వరకు ఈ కుర్చీకి చెదలు పట్టనివ్వను’ అనే డైలాగ్ ట్రైలర్‌లో హైలెట్‌గా నిలిచింది. సల్మాన్ ఖాన్ ప్రత్యేక పాత్రలో తనదైన మెరుపులు మెరిపించారు. నయనతార, సత్యదేవ్, సముద్రఖని ముఖ్య పాత్రల్లో నటించిన ఈ సినిమా మలయాళ సూపర్ హిట్ ‘లూసిఫర్’కి రీమేక్‌గా రూపొందింది. అందులో ఉన్న సీరియస్ నెస్ ఇందులో కూడా కనిపిస్తోంది. తమన్ సంగీతం సినిమాకు కీలకంగా నిలిచింది.