Chiranjeevi Grand Entry As Waltair Veerayya Title Teaser Is Out
mictv telugu

మాస్ ఎంట్రీతో అదరగొట్టిన మెగాస్టార్

October 24, 2022

ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై దర్శకుడు బాబీ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. మాస్, మసాలాలతో చిరంజీవి వింటేజ్‌లుక్‌తో మరోసారి అభిమానులతో కేక పెట్టించేందుకు మెగాస్టార్ చిరంజీవి సిద్దమయ్యారు. ప్రయత్నాలు వదిలేసి మళ్లీ తనకు అచ్చి వచ్చిన స్టయిల్ లోకి వెళ్లి, ముఠామేస్త్రీ లాంటి లుక్ తో మరోసారి ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ సినిమాకు సంబంధించిన టైటిల్, టీజర్‌ను దీపావళీ పండుగ సందర్భంగా రిలీజ్ చేశారు. భారీ యాక్షన్ కట్ లోంచి ఓ బిట్ తీసి టీజర్ లో వేసారు. ఈ వయసులో కూడా చిరంజీవి గ్రేస్, లుక్ బాగున్నాయి. ముఠామేస్త్రి చిరంజీవిని మళ్లీ చూసినట్లుంది.

చిరంజీవి ఫ్యాన్స్ కు ఏం కావాలో అవే టీజర్ లో ఉన్నాయి. లుక్స్, నడక, గెటప్ ఇలా అన్నీ కూడా వింటేజ్ చిరంజీవిని గుర్తు చేసాయి. ఆ విధంగా అన్ని విధాలా టీజర్ పాస్ అయింది. వీరయ్యగా మెగాస్టార్ చిరంజీవి తనని సవాల్ చేసిన రౌడీలకు తనదైన స్టైల్లో సమాధానం చెప్పే ఒక యాక్షన్ సీన్ పై ఈ టీజర్ ను రిలీజ్ చేశారు. రంగు బనీనుపై పూల చొక్కా .. పైకి కట్టిన లుంగీ .. చెవికి రింగులు .. మెళ్లో బంగారు చైన్లు .. ఒక చేతికి బంగారు కడియం .. మరో చేతికి గోల్డ్ వాచ్ .. బ్లాక్ స్పెట్స్ తో కనిపిస్తూ .. బీడీ దమ్ము కొడుతూ చిరంజీవి మాస్ లుక్ తో ఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమాలో వీరయ్యకి యూట్యూబ్ వీడియోస్ చేసే అలవాటు ఉందనే విషయాన్ని ఈ టీజర్ ద్వారా రివీల్ చేశారు. రౌడీలను కొట్టేసిన వీరయ్య .. ‘ఇలాంటి ఎంటర్టైనింగ్ ధమాకాలు ఇంకా చూడాలనుకుంటే లైక్ .. షేర్ .. అండ్ సబ్ స్క్రైబ్ చేయండి’ అంటూ లైవ్ లోనే వీడియో చేసేయడం చూపించారు. సంక్రాంతికి ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.