రాజకీయాల్లో ఎందుకెళ్లానా? అనిపిస్తోంది : చిరంజీవి - MicTv.in - Telugu News
mictv telugu

రాజకీయాల్లో ఎందుకెళ్లానా? అనిపిస్తోంది : చిరంజీవి

March 31, 2022

మెగాస్టార్ చిరంజీవి మరోమారు తన రాజకీయ జీవితంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బుధవారం హీరోయిన్ తాప్సీ పన్ను నటించిన మిషన్ ఇంపాజిబుల్ సినిమా ప్రిరిలీజ్ కార్యక్రమంలో చిరంజీవి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ కొన్ని సార్లు రాజకీయాల్లో ఎందుకెళ్లానా అనిపిస్తుంది. ఎందుకంటే ఆ సమయంలో సినిమాలను వదిలేయడం వల్ల తాప్సీ వంటి ప్రతిభ కలిగిన హీరోయిన్లతో నటించలేకపోయా. అందుకు నేను చాలా ఫీలవుతుంటా. తాప్సీ నటించిన సినిమాలు చూసినప్పుడు ఈమెలో ఇంత ప్రతిభ ఉందా? అని ఆశ్చర్యమేస్తుందం’టూ అభిప్రాయపడ్డారు. ఈ చిత్రం చిన్న చిత్రం కాదని, అందరినీ ఆకట్టుకునే పెద్ద సినిమా అవుతుందని నమ్మకం వెలిబుచ్చారు. అంతేకాక, ఆర్ఆర్ఆర్ చిత్రంపై ప్రశంసలు కురిపించారు. రాజమౌళి మనకు దక్కిన వజ్రమంటూ పొగిడారు. కాగా, నిరంజన్ నిర్మించిన మిషన్ ఇంపాజిబుల్ చిత్రం ఏప్రిల్ 1న విడుదలవుతుంది.