మెగాస్టార్ చిరంజీవి ఆనందంలో తలమునకలు అయిపోతున్నారు. పుత్రోత్సాహంతో తలకిందులు అయిపోతున్నారు. ఆర్ఆర్ఆర్ సినిమాలో రామ్ చరణ్ నటన గురించి బోలెడు ప్రశంసలు వచ్చాయి. రీసెంట్ గా హాలీవుడ్ డైరెక్టర్ జేమ్స్ కామరూన్ ఆర్ఆర్ఆర్ సినిమాలో చరణ్ రామరాజుగా అదరగొట్టారు అంటూ కాంప్లిమెంట్స్ ఇచ్చారు. మొదటి నుంచి కామరూను ఆర్ఆర్ఆర్ సినిమాను పొగుడుతూనే ఉన్నారు. ఇప్పడుబు చరణ్ గురించి అన్న మాటలకు చిరంజీవి తెగ సంబరపడిపోతున్నారు.
ఆర్ఆర్ఆర్ సినిమా చూసినప్పుడు చాలా ఆశ్చర్యపోయానని జేమ్స్ కామరూన్ అన్నారు. కథ చెప్పిన విధానం అయితే షేక్సియర్ క్లాసిక్ లా అనిపించిందని అన్నారు. రామరాజు పాత్ర మైండ్ లో ఏముందో తెలిసాక నిజంగా గుండె బద్ధలయిందని…రాజమౌళిని కలిసినప్పుడు కూడా ఇదే మాట చెప్పానని కామరూన్ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.
ఈ మాటలు విన్న చిరంజీవి సంతోషం వ్యక్తం చేశారు. కామరూన్ సర్ లాంటి వారు చరణ్ను పొగడ్డం అంటే మాటలు కాదని అన్నారు. గ్లోబల్ ఐకాన్, సినిమాటిక్ జీనియస్ అయిన ఆయన అభిప్రాయం ముందు ఆస్కార్ కూడా చిన్నదే అన్నారు. రామ్ చరణ్ ఇంత ఎత్తుకు ఎదిగాడా….తండ్రిగా నేను ఎంతో గర్వపడుతున్నా అని అన్నారు. కామెరూన్ అభినందనలే చరణ్ కు దీవెనలు, బంగారు భవిష్యత్తుకు మెట్లు అంటూ పొంగిపోయారు.