chiranjeevi movie Godfather promo released
mictv telugu

గాడ్ ఫాదర్ ప్రొమో.. ఇద్దరు మెగాస్టార్ల సందడి

September 13, 2022

chiranjeevi movie Godfather promo released

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి తాజాగా నటిస్తున్న గాడ్ ఫాదర్ చిత్రం నుంచి మేకర్స్ ప్రొమో రిలీజ్ చేశారు. బాలీవుడ్ మెగాస్టార్ సల్మాన్ ఖాన్ కీలక పాత్రలో నటిస్తున్న ఈ చిత్రం ప్రొమోలో ఇద్దరు మెగాస్టార్లు సందడి చేశారు. ఇద్దరిపై ‘థార్ మార్ థక్కర్ మార్’ అంటూ సాగే పాట్ ఫస్ట్ సింగిల్ ప్రొమో స్టైలిష్ లుక్‌లో అదిరిపోయింది.

పక్కా మాస్ బీట్‌లో సాగే ఈ పాట పూర్తి వీడియో ఈ నెల 15న రిలీజ్ చేయనున్నట్టు ప్రొమోలో తెలిపారు. అనంతశ్రీరామ్ రాసిన ఈ పాటను శ్రేయా ఘోషల్ పాడింది. చిరంజీవి, సల్మాన్‌పై వచ్చే ఈ పాటకు డ్యాన్స్ కొరియోగ్రఫీని ఇండియన్ మైఖేల్ జాక్సన్ ప్రభుదేవా అందించారు. ఫీమేల్ రోల్‌లో నయనతార నటిస్తుండగా, పూరీ జగన్నాథ్, సత్యదేవ్, సునీల్ మిగతా ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. మలయాళ సూపర్ హిట్ అయిన లూసిఫర్ రీమేక్ అయిన ఈ చిత్రానికి మోహన్ రాజా దర్శకత్వం వహిస్తున్నారు. దసరా కానుకగా వచ్చే నెల 5న ఈ చిత్రం విడుదలవుతోంది.