చిరు..151 శురూ..! - MicTv.in - Telugu News
mictv telugu

చిరు..151 శురూ..!

August 16, 2017

దాదాపు 8 సంవత్సరాల తర్వాత ఖైదీ నం.150 అనే సిన్మతో తన రీ ఎంట్రీ ఇచ్చిన చిరు,వరుసగా సిన్మాలు చెయ్యడానికి సిద్దమయ్యారు. సురేంద‌ర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో స్వాతంత్య్ర స‌మ‌ర‌యోధుడు ఉయ్యాలవాడ నరసింహరెడ్డి జీవితం ఆధారంగా చిరంజీవీ 151 చిత్రం తెరకెక్కనుంది. ఈ రోజు కొణిదెల ప్రొడ‌క్ష‌న్ ఆఫీసులో చిరు 151వ చిత్రం పూజా కార్య‌క్ర‌మాలు జ‌రిపారు.దాదాపు వంద కోట్ల బడ్జెట్ తో రామ్ చరణ్ చిరు 151వ చిత్రాన్ని నిర్మిస్తున్నాడట. ఐశ్వర్యరాయ్, అనుష్క, నయనతార లలో ఎవరో ఒకరిని హీరోయిన్ గా తీసుకుంటారనే ప్రచారం మాత్రం జరుగుతుంది. ఇక బిగ్ బీ అమితాబ్ బచ్చ‌న్ కూడా ఈ చిత్రంలో ప్ర‌ధాన పాత్ర పోషించ‌నున్నాడని వార్త‌లు వ‌చ్చాయి. ఈగ చిత్రంలో విల‌న్ గా న‌టించిన కిచ్చా సుదీప్ కూడా చిరు 151వ చిత్రంలో కీల‌క పాత్ర చేయ‌బోతున్నాడ‌ని అంటున్నారు.మ‌హ‌వీర అనే టైటిల్ ని ఈ మూవీకి ప‌రిశీలిస్తున్నారట.