జనసేన అధ్యక్షుడిగా చిరంజీవి! - MicTv.in - Telugu News
mictv telugu

జనసేన అధ్యక్షుడిగా చిరంజీవి!

December 12, 2017

తన అన్న చిరంజీవిని మోసం చేసిన వారిపై, ఆయనను ఎన్నికల్లో ఘోరంగా ఓడించినవారిపై ప్రతీకారం తీర్చుకుంటానని పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ప్రతిన బూనడం, ప్రజారాజ్యం పార్టీని పదేపదే తలచుకోవడం వెనుక పెద్ద రాజకీయమే జరిగినట్లు తెలుస్తోంది. చిరంజీవిని మళ్లీ ఎలాగైనా సరే, రాజకీయాల్లోకి తీసుకొట్టి, గద్దె నెక్కించడానికి తమ్ముడు అష్టకష్టాలూ పడుతున్నట్లు సమాచారం.ఇందులో భాగంగా చిరంజీవి త్వరలోనే కాంగ్రెస్‌కు రాజీనామా చేసి, జనసేన పగ్గాలు చేపడతారని భావిస్తున్నారు. చిరంజీవి చాలా అమాయకుడని, ఆయనను అధికారంలోకి తీసుకొస్తే ఏపీ ప్రజలకు మేలు జరుగుందని పవన్ చెబుతున్నట్లు విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. అన్నదమ్ముళ్లం ఇద్దరం కలసి రాష్ట్రమంతటా ప్రచారం చేస్తే గెలుపు అవకాశాలు ఉంటాయని తమ్ముడు నచ్చజెబుతున్నట్లు తెలుస్తోంది. అయితే చిరంజీవి ఇంకా ఏ మాటా చెప్పలేదని, పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నారని జనసేన వర్గాలు అంటున్నాయి.

 చిరంజీవి ప్రస్తుతం కాంగ్రెస్ రాజకీయాల్లోనూ చురగ్గా లేరు. ఈ నేపథ్యంలో.. రాజకీయాల్లో మెగా వారసత్వాన్ని కొనసాగించాలంటే తన ఒక్కడి వల్లా సాధ్యం కాదని, మాస్ ఇమేజీ ఉన్న అన్నతోనే సాధ్యమవుతుదని పవన్ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్‌లో ఎన్నేళ్లున్నా ప్రయోజనం ఉండదని, ఏపీలో ఆ పార్టీ ఉనికి కూడా లేకపోవడంతో భవిష్యత్తులో రాజ్యసభ వంటి పదవులు కూడా రావాని అన్నకు తమ్ముడు బోధిస్తున్నాడని అంటున్నారు.  అన్నకు జనసేన పగ్గాలు అప్పగించి, తరచూ రాష్ట్రంలో పర్యటిస్తానని పవన్ చెబుతున్నారని, ఇలా అయితే తన సినిమా షూటింగులకూ ఆటంకం ఉండదని ఆయన భావిస్తున్నట్లు తెలుస్తోంది.