Chiranjeevi Ravi Teja poonakaalu loading song from waltairveerayya On sankranti 2023
mictv telugu

22ఏళ్ళ తరువాత మరో సంచలనం.. మెగా మాస్ సాంగ్ పూనకాలు రిలీజ్..!

December 29, 2022

సంక్రాంతి కానుకగా తెరకెక్కుతున్న భారీ సినిమాల్లో ఒకటైన వాల్తేర్ వీరయ్యతో బాక్సాఫీస్ వార్ కి సిద్ధమవుతున్నాడు చిరంజీవి. ఇప్పటికే బాస్ పార్టీ, భగభగ సాంగ్స్ తో మాస్, క్లాస్ ని ఆకట్టుకుని మంచి హైప్ తెచ్చుకుంది వీరయ్య టీమ్. ముఖ్యంగా బాస్ సాంగ్ కి మార్కెట్ లో విపరీతమైన బజ్ క్రియేట్ అవ్వటంతో మెగా ఫ్యాన్స్ మంచి ఊపులో ఉండగానే ఇప్పుడు అసలు సిసలు మరో అప్డేట్ వచ్చేసింది. ఎప్పటి నుండో పూనకాలు లోడింగ్ అంటూ భారీ అంచనాలని క్రియేట్ చేస్తూ వస్తున్న మూవీ టీమ్.. తాజాగా డేట్ అనౌన్స్ చేసేసింది. వాల్తేర్ వీరయ్య నుండి పూనకాలు లోడింగ్ అనే కొత్త ట్రాక్ డిసెంబర్ 30న విడుదల కానున్నట్టు ప్రకటించిది. దీనికి సంబదించిన పోస్టర్ కూడా రిలీజ్ చేసింది. అయితే ఇది మెగా ఫ్యాన్స్ ని అలరించే అసలు సిసలు డ్యాన్స్ నంబర్‌గా ప్రచారం అవుతుంది. ఇందులో రవితేజతో కలిసి మెగాస్టార్ డ్యాన్స్ చేశాడని తెలుస్తుంది.

ఇక ఈ సాంగ్ మరో స్పెషాలిటీ.. దాదాపు 22 సంవత్సరాల తరువాత మెగాస్టార్ చిరంజీవితో మాస్ మహారాజ రవితేజ స్టెప్పులేశాడు. 2000సంలో విడుదలైన అన్నయ్య మూవీలో చిరుతో కలిసి నటించిన రవితేజ.. ఇన్నాళ్లకు మళ్ళీ వీరయ్యలో స్టార్ హీరోగా మల్టీ స్టారర్ చేశాడు. ఊర మాస్ స్టెప్స్ కి కేర్ ఆఫ్ అయిన రవితేజ మరి గ్రేస్ కా బాప్ చిరంజీవితో కలిసి వేసిన స్టెప్స్ చూడటానికి రెండు కళ్ళు సరిపోవంటున్నారు ఫ్యాన్స్. ఖచ్చితంగా ఈ పూనకాలు లోడింగ్ సాంగ్ టాలీవుడ్ లో ఒక మైలురాయిగా నిలిచిపోతుందని కామెంట్స్ చేస్తున్నారు. అయితే మొన్న ధమాకాలో పల్సర్ బైక్ పాటకి అద్భుతమైన ఎనర్జీతో స్టెప్స్ వేసి షాక్ ఇచ్చిన రవితేజ స్పీడ్ ముందు బాస్ చిరు మ్యాచ్ అవుతారా అన్న సందేహాలు కలుగుతున్నాయి. వయసు ప్రభావంతో చిరు రవితేజ ముందు తేలిపోతారని అంచనాలు వేస్తున్నారు నెటిజన్స్. కానీ బాస్ గ్రేస్ ముందు రవితేజకే కష్టాలు తప్పవని మెగా ఫ్యాన్స్ అంటున్నారు. ఏదేమైనా స్వయంకృషితో ఎదిగిన ఇద్దరు సూపర్ స్టార్స్ కలిసి చేస్తున్న ఈ మూవీ మెగా హిట్ కావాలని సినీ అభిమానులు కోరుకుంటున్నారు.

ఇవి కూడా చదవండి :

వీరయ్య శివదూషణ వివాదం.. ఎట్టకేలకు చంద్రబోస్ వివరణ..!

అర్ధం పర్ధం లేకుండా ఉంది.

ఇండస్ట్రీ పెద్దరికంపై మరోసారి చిరంజీవి సంచలన వ్యాఖ్యలు

నన్ను కోవర్ట్ అన్న కాంగ్రెస్సోడిని చెప్పుతో కొడతా.. ఎమ్మెల్యే జగ్గారెడ్డి విశ్వరూపం\