అవినీతి లేని ఏకైక రంగం ఇదొక్కటే - చిరంజీవి - MicTv.in - Telugu News
mictv telugu

అవినీతి లేని ఏకైక రంగం ఇదొక్కటే – చిరంజీవి

November 28, 2022

మెగాస్టార్ చిరంజీవికి కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఇండియన్ ఫిలిం పర్సనాలిటీ ఆఫ్ ద ఇయర్ – 2022 అవార్డు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అవార్డు అందుకోవడానికి చిరంజీవి గోవాలో జరుగుతున్న 53వ ఇఫీ కార్యక్రమానికి వెళ్లారు. అవార్డు అందుకున్న తర్వాత వేదికపై చిరంజీవి భావోద్వేగానికి గురయ్యారు. ‘గతంలో ఇలాంటి వేడుకల్లో పాల్గొన్నప్పుడు దక్షిణాదికి చెందిన ప్రముఖ నటుల ఫోటోలు ఉండేవి కావు.

అప్పుడు చాలా బాధనిపించేది. కానీ, ఇప్పుడు పరిస్థితి మారింది. ప్రాంతీయ చిత్రాలు అనే భావన పోయి భారతీయ సినిమా అనే పేరు వచ్చింది. ఈ అవార్డు నాలో నూతన ఉత్సాహాన్ని నింపింది. అవార్డు ప్రకటించిన ప్రధాని మోదీకి ధన్యవాదాలు. రాజకీయాల్లో వెళ్లడం వల్ల సినిమా విలువేంటో తెలిసివచ్చింది. అవినీతి లేని ఏకైక రంగం సినిమా రంగం. ఇక్కడ టాలెంట్ ఉంటేనే ఎదుగుతాం. ఇప్పుడున్న యువ హీరోలు నాకు పోటీ కాదు. నేనే వారికి పోటీ. నన్ను ఇంతవరకు అభిమానించిన తెలుగు ప్రేక్షకులను ధన్యవాదాలు’అని వ్యాఖ్యానించారు.