మేఘనకు పండంటి బిడ్డ.. చిరు మళ్లీ పుట్టాడు - MicTv.in - Telugu News
mictv telugu

మేఘనకు పండంటి బిడ్డ.. చిరు మళ్లీ పుట్టాడు

October 22, 2020

Chiranjeevi Sarja is back: Meghana Raj gives birth to a baby boy

కన్నడ సనీ నటుడు, యాక్షన్ కింగ్ అర్జున్ మేనల్లుడు చిరంజీవి సర్జా ఈ ఏడాది జూన్ మాసంలో గుండెపోటుతో మృతిచెందిన విషయం తెలిసిందే. చిరంజీవి మృతితో ఆయన కుటుంబంలోనే కాకుండా, కన్నడ చిత్రపరిశ్రమలో తీరని విషాధం నెలకొంది. చిరంజీవి చనిపోయేనాటికి ఆయన సతీమణి గర్భవతి. ఇటీవల సీమంతం వేడుక మేఘన పుట్టింటిలో జరిగింది. ఆ కార్యక్రమంలో మేఘన మరణించిన తన భర్త ఫోటోను పక్కన పెట్టించుకోవడం పలువురిని కంటతడి పెట్టించింది. ఆ ఫోటో నుంచి తన భర్త ఆశీర్వాదం పొందింది. ఈ క్రమంలో మేఘనారాజ్ గురువారం ఉదయం 11.07 గంటలకు పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. చిరు సోదరుడు ధృవ్ సర్జా, బాబును చేతుల్లోకి ఎత్తుకుని అన్న ఫోటో వద్దకు తీసుకెళ్లి చూపించిన ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అందరూ జూనియర్ చిరంజీవి అంటూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. 

ఈ వార్త తెలిసి చిరంజీవి అభిమానులు ఆసుపత్రి వద్దకు భారీగా చేరుకున్నారు. ఈ క్రమంలో చిరు కుటుంబ సభ్యులు అభిమానులందరికీ స్వీట్లు పంచిపెట్టారు. ‘మా హీరో పునర్జన్మ ఇది. చిరంజీవి మళ్లీ పుట్టాడు’ అని అభిమానులు మేఘనకు, బుల్లి చిరుకు శుభాకాంక్షలు తెలిపారు. తనను ఎప్పుడూ ఒంటరిగా వదిలి ఉండనని చెప్పిన చిరు అన్న మాట నిలుపుకున్నాడని మేఘనా అన్నారు. బుల్లి చిరు రూపంలో మళ్లీ నాకు తోడుగా వచ్చాడని ఆనందం వ్యక్తంచేశారు. చిరుకు ఉన్న అదే ఆదర్శాలతో బాబును పెంచుతామని మేఘనా చెప్పారు.