ఈరోజు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బర్త్ డే. ‘ఆర్ ఆర్ ఆర్’ సినిమాతో గ్లోబల్ స్టార్ అయిన చరణ్ ఆస్కార్ అందుకున్న తర్వాత జరుపుకుంటున్న పుట్టినరోజు కావడంతో ఇది చాలా స్పెషల్ గా మారింది. తండ్రిని మించిన తనయుడిగా ఎదుగుతున్న చరణ్ విషయంలో చిరంజీవి పుత్రోత్సాహంతో మునిగితేలుతున్నారు. చరణ్ సక్సెస్ లు చూసి ఎంతో గర్వంగా ఉందని చిరంజీవి చెప్పిన సందార్బాలెన్నో. బిడ్డలు ఉన్నత స్థానాలకు ఎదుగుతుంటే…తల్లిదండ్రులకు అంత కు మించి ఇంకే కావాలి! అంటూ కొడుకు ఎదుగదలని చూసి ఎన్నో సార్లు మురిసిపోయారు. తాజాగా పుట్టిన రోజు సందర్భంగా చరణ్ కి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు మెగాస్టార్. కొడుకుని దగ్గర కు తీసుకుని, ప్రేమతో ముద్దు పెట్టి విషెష్ తెలియజేసారు. ‘గర్వంగా ఉంది నాన్న’ అంటూ ట్విట్టర్లో ఈ ఫోటోకి ట్యాగ్ చేసారు.
Proud of you Nanna.. @AlwaysRamCharan
Happy Birthday!! 🎉💐 pic.twitter.com/JnDXc50N8W— Chiranjeevi Konidela (@KChiruTweets) March 27, 2023
ఇందులో ఇద్దరు క్యాజువల్ దుస్తుల్లో కనిపిస్తున్నారు. మెగా ఇమేజ్ తో ప్రవేశించినా చరణ్…తనకంటూ ఒక గుర్తింపును తెచ్చుకున్నాడు. ప్యాషన్ తో చేస్తూ.. ఎంత ఎత్తుకి ఎదిగినా ఒదిగే గుణంతో అందరి చేత శబాష్ అనిపించుకుంటున్నాడు. చిరంజీవిలానే డౌన్ టు ఎర్త్ అన్నట్టు ఉండటానికి ఎప్పుడూ ప్రయత్నిస్తాడు. చరణ్ పుట్టినరోజు నాడు చిరంజీవి పెట్టిన పోస్ట్ ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ గా మారింది. చిరు ట్వీట్ చరణ్ అంటే ఎంతో ఇష్టమో మరోసారి తెలిజయేస్తుంది.
చిరు-చరణ్ ల ఇలాంటి మూమెంట్ ని అభిమానులతో షేర్ చేసుకోవడం గతంలోనూ జరిగింది. ఓ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అభిమానుల సమక్షంలోనే చరణ్ ని హత్తుకుని ముద్దులు పెట్టి తండ్రి ప్రేమను చాటుకున్నారు. ఇప్పుడు ఆపాత ఫోటోలు కూడా మళ్ళీ రిపీట్ అవుతున్నాయి. దాంతో పాటు చరణ్ చిన్నప్పటి ఫోటోలు, చిరంజీవితో ఉన్న పిక్స్ అన్నీ సోషల్ మీడియాలో విపరీతంగా తిరుగుతున్నాయి. అలాగే మెగా బ్రదర్స్ నాగబాబు..పవన్ కళ్యాణ్ కూడా చరణ్ని ఆశీర్వదించారు.