Chiranjeevi Sings Jambalakidi Jarumitaya Song In Waltair Veerayya Movie
mictv telugu

‘నా లుంగీ సాయ చూడకుంటే.. తీసేస్తా చూడు..’

January 13, 2023

 

“నేను జడేస్తాను చూడు.. నేను జడేస్తాను చూడు.. నా జడ సాయ చూడకుంటే.. తీసేస్తా చూడు.. జంబలకిడి జారుమిఠాయా”.. అంటూ ఓ పాట సోషల్ మీడియాలో గత కొన్ని రోజులుగా తెగ వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. జిన్నా మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ సందర్భంగా.. చిత్తూరు జిల్లా నుంచి తీసుకొచ్చిన ఓ మహిళతో మంచు మోహన్‌ బాబు ఈ పాట పాడించారు. గతేడాది ఈ పాట సోషల్ మీడియాలో ఎక్కువగా ట్రెండ్ అయ్యింది. ఈ పాటపై విపరీతమైన ట్రోల్స్‌తో పాటు.. ఎన్నో యూట్యూబ్ షార్ట్ వీడియోస్, ఇన్ స్టా రీల్స్ వచ్చాయి. ఆ ట్రెండ్‌ని పట్టుకున్నాడు వాల్తేరు వీరయ్య డైరక్టర్ బాబీ. ఆ ఈవెంట్‌లో ఆ మహిళ ‘నేను చీర కడతా చూడు.. నేను చీర కడతా చూడు.. నా చీర సాయి చూడకుండా తీసేస్తా చూడు’ అని పాడింది. వాల్తేరు వీరయ్య మూవీలో మెగాస్టార్ చిరంజీవి చీర స్థానంలో లుంగీ పదాన్ని యాడ్ చేసి పాడుతూ డ్యాన్స్ కూడా చేస్తూ కనిపించారు.

ఈ సినిమాలో చిరంజీవి తన మార్క్ డ్యాన్స్, పైట్స్, యాక్షన్ సీన్స్‌తో మెప్పించడమే కాదు.. చాలా రోజుల తర్వాత ‘రిక్షావోడు’ ‘ఘరానా మొగుడు’ మార్క్ కామెడీతో నవ్వులు పూయించారు. ఇక చిరంజీవి ట్రాక్‌కి తగినట్లు తన హావభావాలతో చెలరేగిపోయారు. ఈ సినిమాలో విలన్ ను కిడ్నాప్ చేసేందుకు హీరో చిరంజీవి సీరియస్‌గా స్కెచ్ వేస్తుంటారు. ఆ టైమ్‌లో కమెడియన్ వెన్నెల కిషోర్ అనవసర ప్రశ్నలతో డిస్ట్రబ్ చేస్తాడు. దాంతో చిరంజీవి..గతంలో వైరలైన ఓ న్యూస్ రిపోర్టర్ ఫ్రస్టేషన్ వీడియోలో డైలాగ్‌లను చెప్పారు. ‘బేసిక్ సెన్స్ ఉండదు.. చేసే మూడు, ఉత్సాహం.. సర్వనాశనం అయిపోతాయి. అంటేనేమో అందరికీ కోపం వస్తుంది.. అందరూ హర్ట్ అయిపోతారు’ అంటూ తన దైన శైలిలో చెప్పి నవ్వులు పూయించారు. అలానే చిరంజీవి, వెన్నెల కిషోర్ మధ్య కామెడీ ట్రాక్ కూడా ఫస్ట్ హాఫ్ అభిమానుల్ని అలరిస్తుంది.