Chiranjeevi Strong Counter TO Minister Roja
mictv telugu

తెలిసి మాట్లాడుతున్నావా.. తెలియక మాట్లాడుతున్నావా..!

January 11, 2023

మెగా ఫ్యామిలీపై పదునైన వ్యాఖ్యలు చేయటంలో ముందుండే వారిలో మంత్రి రోజా ఒకరు. మినిస్టర్ అయ్యాకా కాస్త ఫైర్ తగ్గినా.. తాజాగా పవన్ కళ్యాణ్, చిరంజీవిలని తూలనాడి తిరిగి ఫార్మ్ లోకి వచ్చింది. ఏపీ ఫైర్ బ్రాండ్ గా ముద్రపడ్డ మంత్రి రోజా తన పేరుకి తగ్గట్టే మెగా బ్రదర్స్ ని తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టేసింది. పిల్లికి కూడా బిచ్చం వెయ్యని ఫ్యామిలీ.. సొంత మనుషులకి ఏమి చేయని బ్రదర్స్ అంటూ చిరు పవన్ లపై విరుచుకుపడింది. దాంతో రోజాపై పెద్ద ఎత్తున జనసైనికులు, మెగా ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. మున్సిపాలిటీ మౌత్ అంటూ నాగబాబు రోజాపై సీరియస్ అవ్వగా.. కాస్త టంగ్ అదుపులో పెట్టుకోండి అన్నట్టు జబర్దస్త్ నటుడు గెటప్ శ్రీను వార్ణింగ్ ఇవ్వగా.. ఇప్పుడు తాజాగా మెగాస్టార్ చిరంజీవి ఈ ఇష్యుపై రియాక్ట్ అయ్యాడు. రోజా పేరెత్తకుండా.. నాతో కలిసి పని చేసిన వారు అంటూ రోజాకి ఇన్ డైరెక్ట్ గా ఇవ్వాల్సిన పంచులు ఇచ్చేశాడు చిరంజీవి.

రోజా వ్యాఖ్యలపై చిరంజీవి తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ‘ఒకప్పుడు సినిమా ఇండస్ట్రీలో ఉండి నాతో క్లోజ్‌గా ఉంటూ కూడా.. ఇప్పుడు ఇలా మాట్లాడుతుంటే.. అరె నిన్ననే కదా మనింటికి వచ్చారు.ఇప్పుడేంటీ ఇలా మాట్లాడుతున్నారు అనిపిస్తుంటుంది. నేను ఏ సహాయ సహాకారాలు చేయలేదా? ఎవరికీ హెల్ప్ కాలేదా? నేను ఎప్పుడు సాయం చేయలేదో నిరూపించమనండి. నా తృప్తి కోసం ఇచ్చాను.. దాన్ని పబ్లిసిటీ చేసుకోలేదు. ఓకే నీకంతే తెలిసింది! కానీ సహాయం చేసిన వారికి తెలుసు అది చాలు. నీకు తెలియక అన్నావో..తెలిసినా సరే అన్నావో అది నీ విజ్ఞతకే వదిలేస్తున్నా. ఇలాంటి వారిని నేను కేర్ చేయను. ఎందుకంటే నా సమయం చాలా విలువైనది. నా మానసిక ప్రశాంతత మరింత విలువైంది.’’ అని చిరంజీవి చెప్పుకొచ్చారు.