మెగాస్టార్ చిరంజీవి దారెటు? - MicTv.in - Telugu News
mictv telugu

మెగాస్టార్ చిరంజీవి దారెటు?

November 21, 2022

జగన్ వై నాట్ 175 అంటున్నారు. చంద్రబాబు చివరి ఎన్నికల సెంటిమెంట్ రగలిస్తున్నారు. పవన్ కల్యాణ్ ఒక్క ఛాన్స్ ప్లీజ్ అంటున్నారు. మరి మెగా స్టార్ చిరంజీవి దారెటు? నేను ఇంకా రాజకీయాల్లో ఉన్నా అనే డైలాగ్ తో అదరగొట్టిన చిరు ఇప్పుడు పవన్ కల్యాణ్‌కే సపోర్ట్ చేస్తారా? లేక కాంగ్రెస్‌లో అలా కంటిన్యూ అవుతారా? 2024 ఎన్నికల్లో చిరంజీవి దారెటు?

మిషన్ 2024

ఏపీ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ఎన్నికలకు చాలా సమయం ఉన్నా..అప్పుడే హీట్ పుట్టింది. 2024 టార్గెట్‌గా పార్టీలు పావులు కదుపుతున్నాయి. మరోసారి అధికారంలోకి వచ్చేందుకు జగన్ గ్రౌండ్ వర్క్ చేస్తున్నారు. వై నాట్ 175 అంటూ ముందుకు వెళ్తున్నారు. విపక్షాలూ దూకుడుగా ప్రజల్లోకి వెళ్తున్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చివరి ఎన్నికల సెంటిమెంట్ తెరపైకి తెచ్చారు. 2024లో గెలవపోతే మళ్లీ పోటీ చేయనని ఆయన అంటున్నారు. పవన్ కల్యాణ్ ఒక్క ఛాన్స్ ప్లీజ్ అంటూ జనంలోకి వెళ్తున్నారు. పవన్ కల్యాణ్ తమతో కలిసి పోటీ చేస్తారని బీజేపీ చెబుతుంది.ఏపీ విభజన తర్వాత కనిపించికుండా పోయిన కాంగ్రెస్..ఇప్పటికీ కోలుకోలేదు. అన్నీ పార్టీలు ఎన్నికల హీట్ పుట్టిస్తున్నా సైలెంట్‌గా ఉంది.అందులో ఉన్న ముఖ్యనేతలు మౌనంగానే ఉన్నారు. మెగాస్టార్ చిరంజీవి కూడా ఇంకా కాంగ్రెస్‌లో కంటిన్యూ అవుతున్నారు. ఆ మధ్య గాడ్ ఫాదర్ సినిమా డైలాగ్‌తో రాజకీయ చర్చకు దారితీసింది. అప్పుడు చిరంజీవి రాజకీయ భవిష్యత్ పై ఊహాగానాలు వచ్చాయి. ఈ క్రమంలో చిరంజీవి కాంగ్రెస్‌లోనే ఉన్నారని మెంబర్ షిప్ కార్డుని ఇష్యూ చేసింది. ఆ తర్వాత అది ఓన్లీ సినిమా డైలాగే అని అంతా కూల్ అయ్యారు.

తమ్ముడికే మద్దతా?

ఏపీ రాజకీయాల్లో మెగాస్టార్ ది ప్రత్యేక పాత్ర. అప్పట్లో ప్రజారాజ్యం పార్టీతో రాజకీయాల్లోకి వచ్చారు. తిరుపతిలో ఎన్నికల శంఖారావాన్ని పూరించారు. ఆ తర్వాత పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేశారు.అప్పటి నుంచి కాంగ్రెస్‌లోనే కొనసాగుతున్నారు. రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో కాంగ్రెస్ కోలుకోలేని విధంగా దెబ్బతింది. ఆ పార్టీ ఇప్పటికీ తేరుకోలేదు. అందులో ఉంటున్న నేతలు సైలెంట్‌గా ఉంటున్నారు. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి పై అందరి దృష్టి పడింది. ఏపీ రాజకీయాల్లో తమ్ముడు పవన్ కల్యాణ్ యాక్టివ్ అయ్యారు. ఒక్క ఛాన్స్ ప్లీజ్ అంటూ మిషన్ 2024 మొదలెట్టారు.గత ఎన్నికల కంటే భిన్నంగా ఈసారి సేనాని వేగం పెంచారు.

సీఎం రేసులో సేనాని?

రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో జనసేనను రేసులో ఉంచేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. సీఎం అభ్యర్థి రేసులో ఉండే అవకాశం ఉంది. అందుకే చిరంజీవి కీలకంగా మారబోతున్నారు. పవన్ కల్యాణ్ కే సపోర్ట్ చేస్తారా అనేది ఉత్కంఠగా మారింది. ఆయన కూడా ఇన్ డైరెక్ట్ గా తమ్ముడు పవన్ కల్యాణ్‌కే మద్దతు అని సంకేతాలు ఇచ్చారు. అవసరమైతే జససేనలో చేరుతారని పీకే ఫ్యాన్స్ అంటున్నారు. కానీ చిరంజీవి బహిరంగంగా ఎప్పుడు చెప్పలేదు. ఎలాగూ పవన్ బీజేపీతో కలిసి వెళ్తున్నారు. ప్రధాని మోదీతో చిరంజీవికీ మంచి రిలేషన్ ఉంది. మెగాస్టార్ చిరంజీవిపై ప్రధాని మోదీ ప్రశంసల వర్షం కురిపించారు. ఇండియన్ ఫిలిం పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ 2022 పురస్కారం వరించడంపై మోదీ ట్వీట్ చేశారు. “చిరంజీవి విలక్షణమైన నటుడు. అద్భుతమైన వ్యక్తితత్వం,నటనాచాతుర్యంతో ఎన్నో తరాల ప్రేక్షకుల అభిమానాన్ని పొందుతున్నారు. ఇండియన్ ఫిలిం పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ అవార్డుకు ఎన్నికైనందుకు నా అభినందలు”అని మోదీ ట్వీట్ చేశారు. మోదీ చేసిన ఈ ట్వీట్ కూడా ఆసక్తికరంగా మారింది. పవన్ కల్యాణ్ బీజేపీతో, మోదీతో టచ్‌లో ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో దోస్తీ కొనసాగుతోంది. సో ఇప్పుడు చిరంజీవిపై మోదీ ప్రశంసనలు ఆసక్తిరేపుతన్నాయి.