మెగాస్టార్ చిరంజీవి 150 వ సినిమాగా ‘ ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి ’ సినిమానే వస్తుందని ఆ మధ్య పుకార్లు షికార్లు చేసాయి. కానీ చివరికి ‘ ఖైదీ నెంబర్ 150 ’ సినిమా చేసి మంచి హిట్టు కొట్టిన చిరు ఇప్పుడు తన తదుపరి 151 వ ఉయ్యాలవాడ చిత్రం కోసం చాలా పర్ ఫెక్టుగా ప్లాన్ చేస్కుంటున్నారు. అయితే ఈ సినిమాలో తొలుత నుండీ హీరోయిన్ ఎవరనే సంకట స్థితి ఏర్పడింది. అనుష్క, శ్రీయ, టాబు, ఐశ్వర్య రాయ్ ఇలా.., చాలా మంది కథానయకిల పేర్లు వినబడ్డాయి.
చివరికిప్పుడు నయనతార పేరును చిత్ర బృందం ఫైనల్ చేసినట్టు సమాచారం. నయనతార ఇండస్ట్రీలో ఎక్కువగా సీనియర్ హీరోల సరసననే నటించింది. చిరంజీవితో నయన్ కాంభినేషన్ చక్కగా కుదురుతుందని చాలా మంది అనుకుంటున్నారు. మెగా ఫ్యాన్స్ కు కూడా ఇది ఖుష్ ఖబర్. తన సెకెండ్ ఇన్నింగ్స్ ను చాలా జాగ్రత్తగా ప్లాన్ చేస్తున్న చిరంజీవి ఉయ్యాలవాడ చిత్రానికి సురేందర్ రెడ్డిని దర్శకుడిగా ఎన్నుకోవడంలోనే ఆయన ఇంట్రస్టు ఏ రేంజులో వుందో అర్థమౌతోంది.
పరుచూరి బ్రదర్స్ ఎంతో రుచిగా వండిన కథ ఉయ్యాలవాడ. సురేందర్ రెడ్డి డైరెక్షనే ఈ సినిమాను ఒక రేంజులో నిలబెడుతుందని రామ్ చరణ్ అభిలషిస్తున్నాడు. చిరంజీవి కెరియర్లో ఈ సినిమా చాలా గొప్ప సినిమాగా నిలబడిపోతుందని ఇప్పటికే చాలా అంచనాలు నెలకొన్నాయి. భారీ సెట్టింగులతో, అత్యంత భారీగా వస్తున్న ఉయ్యాలవాడ సినిమా రికార్డులను బద్దలు కొట్టడం ఖాయమే అంటున్నారు. ఎందుకంటే ఒక హిస్టారికల్ సబ్జెక్టు అవడంతో దీని మీద ఇంట్రెస్టు క్రియేట్ అయింది. మొత్తానికి ఉయ్యాలవాడకి హీరోయిన్ కన్ ఫర్మ్ అవడంతో చిత్ర బృందంలో ఇన్నాళ్ళుగా నెలకొన్న సందిగ్ధత సమసిపోయిందనే చెప్పుకోవాలి.
chiranjeevi, surendar reddy, paruchuri brothers, nayana tara, anushka, Ishvarya roy