మెగా అభిమానులకు ‘సైరా’  మరో కానుక - MicTv.in - Telugu News
mictv telugu

మెగా అభిమానులకు ‘సైరా’  మరో కానుక

September 26, 2019

మెగా అభిమానులకు సైరా నరసింహరెడ్డి చిత్రయూనిట్ అద్భుతమైన కానుక ఇచ్చింది. ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఈ సినిమా నుంచి మరో ట్రైలర్ విడుదల చేశారు. ఇప్పటికే ఓ ట్రైలర్ విడుదల చేయగా మంచి క్రేజ్ వచ్చి సినిమాపై అంచనాలను భారీగా పెంచేసింది. ఇదే సమయంలో యుద్ధ సన్నివేశాలు, కీలకమైన డైలాగులతో కూడిన మరో ట్రైలర్ బయటకు వదిలారు. ఆంగ్లేయులను నరసింహారెడ్డి చీల్చి చెండాడిన విధానాన్ని కళ్లకు కట్టినట్టుగా చూపించారు. బ్రిటీష్ వారి దోపిడీని అడ్డుకునేందుకు ఎటువంటి ఎత్తుగడలు వేశారనేది ఈ ట్రైలర్‌లో స్పష్టంగా చూపించారు. 

మెగాస్టార్ చిరంజీవి డ్రీమ్ ప్రాజెక్టుగా ఆయన 151వ సినిమాను తెరకెక్కిస్తున్నారు.కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్‌పై రామ్ చరణ్ నిర్మిస్తున్న ఈ సినిమాకు సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. తెలుగు,హిందీ,తమిళ, కన్నడ భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది. భారీ అంచనాల నడుమ ఈ చిత్రం వచ్చేనెల 2న గాంధీ జయంతి సందర్భంగా థియేటర్స్‌లోకి రాబోతోంది. భారీ సెట్టింగులు, గెరిల్లా యుద్ధ తంత్రాలు సినిమాపై అంచనాలను మరింత పెంచేశాయి.