Chiranjeevi Thanks Union Minister Anurag Thakur For Visiting His Place
mictv telugu

చిరంజీవి ఇంటికి కేంద్రమంత్రి..నాగార్జున, అల్లు అరవింద్‎లతో కలిసి సమావేశం

February 27, 2023

Chiranjeevi Thanks Union Minister Anurag Thakur For Visiting His Place

కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ ప్రస్తుతం తెలంగాణలో పర్యటిస్తున్నారు. నేడు ఆయన చిరంజీవి ఇంటికి వెళ్లారు. చిరంజీవి నివాసంలో పలువురు సినీ ప్రముఖకులు అనురాగ్ ఠాకూర్‌తో భేటీ అయ్యారు. చిరంజీవితో పాటు నాగార్జున, అల్లు అరవింద్‌లు అనురాగ్ ఠాకూర్‌‌ను కలిసిన వారిలో ఉన్నారు. ఈ సందర్బంగా చిత్ర పరిశ్రమకు సంబంధించిన అంశాల గురించి వారితో కేంద్ర మంత్రి చర్చించారు. ముందుగా ఇంటికి వచ్చిన కేంద్ర మంత్రిని చిరంజీవి, నాగార్జున శాలువా కప్పి సత్కరించారు. ఆయనకు వినాయకుడి ప్రతిమను బహూకరించారు.అనురాగ్ ఠాకూర్‌‎తో భేటీ ఫోటోలను ట్విట్టర్ వేదికగా షేర్ చేశారు మెగాస్టార్.

తన నివాసానికి వచ్చిన అనురాగ్ ఠాకూర్‎కు ధన్యవాదాలు తెలుపుతున్నానని చిరంజీవి ట్వీట్ చేశారు. హైదరాబాద్‌ పర్యటనలో ఉన్న కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్.. తన వద్దకు రావడానికి సమయం కేటాయించినందుకు ధన్యవాదాలు తెలిపారు. సోదరుడు నాగార్జునతో కలిసి భారతీయ సినీపరిశ్రమ గురించి కేంద్రమంత్రితో జరిపిన ఆహ్లాదకరమైన చర్చలు నచ్చాయని వెల్లడించారు.ఇటీవల కాలంలో దేశంలో ప్రముఖ క్రీడాకారులను, నటులను బీజేపీ ముఖ్య నేతలు కలస్తుండడంతో.. వీరి భేటీ చర్చనీయాంశంగా మారింది.