2023 సంక్రాంతికి ఎన్ని సినిమాలున్నా.. చిరంజీవి, బాలయ్యల మధ్యే తీవ్ర పోటీ ఉంటుంది. వీరిద్దరి ఫ్యాన్స్ మధ్య ఉండే కోల్డ్ వార్ కారణంగా వాల్తేరు వీరయ్య,వీరసంహారెడ్డి చిత్రాలకి సంభందించిన ప్రతి చిన్న విషయాన్నీ పోటిగానే చూస్తున్నారు. జనవరి 11న తమిళ హీరో అజిత్‌కుమార్ తెగింపు, తలపతి విజయ్ వారసుడు వంటి డబ్బింగ్ చిత్రాలున్నా తెలుగు ప్రేక్షకుల దృష్టి అంతా నటించిన వరిసు, బాలకృష్ణ వీరసింహారెడ్డి, చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య సినిమాలపైనే. ఈ నేపథ్యంలో తాజాగా ఈ ఇద్దరి హీరోల మధ్య ట్రైలర్ వార్ కొనసాగుతుంది. రెండు రోజుల ముందు బాలకృష్ణ వీరసింహ రెడ్డి ట్రైలర్ విడుదలవ్వగా.. నిన్న సాయంత్రం మెగాస్టార్ వాల్తేరు వీరయ్య థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ అయింది.
గతంలో విడుదలైన పాటలలో కూడా తీవ్ర పోటీ నెలకొంది. ఎవరి సాంగ్ కి వ్యూస్ ఎక్కువ వచ్చాయి, ఎవరి వీడియోకి లైక్స్ ఎక్కువ వచ్చాయని ఫ్యాన్స్ తెగ పోటీ పడ్డారు. ఇప్పుడు ఈ పోటీ ట్రైలర్స్ మధ్య నెలకొంది. ఈ రెండు సినిమాల ఓపెనింగ్ కి ట్రైలర్స్ కీలకం కానున్న నేపథ్యంలో మరో సారి సోషల్ మీడియాలో హడావుడి మొదలు అయ్యింది. నిన్న విడుదల అయిన చిరంజీవి వాల్తేరు వీరయ్య ట్రైలర్ కేవలం 10 గంటల్లోనే 10 మిలియన్ల వ్యూస్ ను సొంతం చేసుకుని.. 440వేల ప్లస్ లైక్స్ ను దక్కించుకుంది. ఇక బాలయ్య బాబు నటించిన’వీరసింహారెడ్డి’కి 14 గంటల్లో కేవలం 5 మిలియన్స్ వ్యూసే దక్కగా.. 24గంటల్లో 10మిలియన్ వ్యూస్ క్రాస్ చేసి.. 400వేల లైక్స్ పొందింది. ఈ క్రమంలో బాలయ్య వీర సింహా రెడ్డి ట్రైలర్ మీద చిరంజీవి వాల్తేరు వీరయ్య స్పష్టంగా పై చేయి సాధించింది. వీర సింహా రెడ్డి 24 గంటల్లో నమోదు చేసిన రికార్డ్స్‌ను, వీరయ్య పదే పది గంటల్లో కొల్లగొట్టి అవతల పారేశాడు.