రాంచరణ్‌కి చిరంజీవి వార్నింగ్.. సెట్స్‌లో చూసుకుందాం - MicTv.in - Telugu News
mictv telugu

రాంచరణ్‌కి చిరంజీవి వార్నింగ్.. సెట్స్‌లో చూసుకుందాం

April 16, 2022

shiva

హనుమాన్ జయంతి సందర్భంగా ‘ఆచార్య’ సినిమాకి సంబంధించిన ఓ అప్డేట్‌ను చిత్రబృందం వెల్లడించింది. ఈ సినిమాలోని ‘భలే భలే బంజారా’ అనే సాంగ్‌ను ఏప్రిల్ 18న విడుదల చేయబోతున్నామని, ముందుగా ఓ చిన్న వీడియోను విడుదల చేశారు. శనివారం సినిమా దర్శకుడు కొరటాల శివ.. చిరంజీవి, రాంచరణ్‌ల మధ్య సంభాషణ జరిగింది. సంభాషణలో భాగంగా పలు విషయాలను, చిత్రీకరణ సమయంలో జరిగిన కొన్ని సంఘటనల గూర్చి వారు చర్చించారు. ఈ క్రమంలో ‘భలే భలే బంజారా’ సాంగ్‌లో రాంచరణ్‌తో పోటీ పడుతూ డాన్స్ చేయడానికి చిరంజీవి కష్టపడాల్సి వస్తుందని, కావున రాంచరణ్‌ని కొంచెం తగ్గాలని అడిగారు. దానికి రాంచరణ్ తగ్గను డాడీ అన్నాడు. దీంతో రేపు సెట్స్‌లో చూసుకుందాం అని చిరంజీవి ఫన్నీగా రాంచరణ్‌కు వార్నింగ్ ఇచ్చారు.

మరోపక్క మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్ర‌లో మెగా ప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ కీల‌క పాత్ర‌లో ‘ఆచార్య’ సినిమా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని కొణిదెల ప్రొడ‌క్ష‌న్ కంపెనీ సమర్పణలో, మ్యాట్నీ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ప‌తాకాల‌పై డైరెక్ట‌ర్ కొర‌టాల శివ తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటుంది. ముందుగా ఫిబ్రవరి 4న ఈ సినిమాను రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ, ఏప్రిల్ 29కి వాయిదా వేశారు.