అల్లు అర్జున్‌కు బర్త్‌డే విషెస్ చెప్పిన మెగాస్టార్ చిరంజీవి - MicTv.in - Telugu News
mictv telugu

అల్లు అర్జున్‌కు బర్త్‌డే విషెస్ చెప్పిన మెగాస్టార్ చిరంజీవి

April 8, 2022

01

 

స్టైలిస్ స్టార్ అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. ‘ హ్యాపీ బర్త్‌డే బన్నీ. సినిమాల పట్ల నువ్వు చూపే అంకితభావం, కష్టపడే తత్వం, కథకు తగ్గట్టు నిన్ను నీవు మలచుకునే తీరు వంటివి నీకు విజయాలు తెచ్చిపెడుతున్నాయి. పుష్పతో పాన్ ఇండియా లెవెల్లో పేరు సంపాదించిన సందర్భంగా ఈ పుట్టిన రోజును మరింత గ్రాండ్‌గా జరుపుకో’అంటూ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌ను అభిమానులు లైకులు కొట్టి, రీట్వీట్ చేస్తున్నారు. కొద్దిసేపట్లోనే చిరంజీవి ట్వీట్‌ను 8800 మంది లైక్ చేశారు. 2200 మంది రీట్వీట్ చేశారు. ఇదిలా ఉండగా, రష్మిక మందన్నా, రకుల్ ప్రీత్ సింగ్, అనసూయ, దర్శకుడు మెహర్ రమేష్, నిర్మాత ప్రసాద్ పొట్లూరిలు బన్నీకి విషెస్ తెలిపారు. కాగా, అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప పార్ట్ 2 సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది.