చిరంజీవికి జేడీ చక్రవర్తి లేఖ.. తిడుతున్నాడా? పొగుడుతున్నాడా?
మెగాస్టార్ చిరంజీవికి నటుడు జేడీ చక్రవర్తి రాసిన లేఖ ఇప్పుడు టాలీవుడ్‌లో ఆసక్తికర చర్చకు దారి తీసింది. లాక్‌డౌన్ కారణంగా సినీ పరిశ్రమలో పని చేసే కార్మికుల కోసం అగ్రతారలు అంతా క్రైసిస్ కమిటీని ఏర్పాటు చేసి దాని ద్వారా సాయం అందిస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై స్పందిస్తూ జేడీ చక్రవర్తి చిరుకు ఓ లేఖ రాశారు. ప్రస్తుత పరిస్థితుల్లో మిమ్మల్ని మెగాస్టార్ అంటూ పిలవలేం అంటూ ట్వీట్ చేశారు. ఇది కాస్తా వైరల్ అయ్యింది. దీంతో ఫిలిం వర్గాలు జేడీ స్పందించిన తీరుపై చర్చించుకుంటున్నాయి.
ఆయన ట్వీట్‌లో కరోనా సమయంలో అందుతున్న సాయంపై స్పందించారు. ఈ సందర్భంగా
"You are not a Megastar anymore" - JD Chakravarthy about @KChiruTweets. #lockdown#Covid_19india #stayhome pic.twitter.com/n40lNkqYj8
— Vamsi Shekar (@UrsVamsiShekar) May 3, 2020
‘ప్రియమైన చిరంజీవిగారు.. నేను మీ అభిమానినే కానీ అనుచరుడిని కాను. మీమ్మల్ని నటుడిగా ఇష్టపడే వాడిని. నా తరం నటులందరూ మీతో చక్కగా కలిసిపోయేవారు. మీతో కలిసి స్పెండ్ చేయడానికి ఆసక్తి చూపేవారు. కానీ నేనెప్పుడూ అలా చేయలేదు. అందుకే నేను మీకు ఓపెన్ లెటర్ రాస్తున్నా.. మిమ్మల్ని మెగాస్టార్ అనలేం సార్.. అంతకుమించి గొప్ప వ్యక్తి సినీ కార్మికులకు ఎంతో మందికి సాయం చేస్తున్నారు. కొందరు సినీ కార్మికులు నాకు ఫోన్ చేసినప్పుడు తమ కుటుంబాలకు ఎలాంటి ఆకలి సమస్యలు లేవని, చిరంజీవిగారు కావాల్సినంత నిత్యావసర వస్తువులను అందజేశారని తెలిసింది. బెటర్ హ్యుమన్‌గా ఎలా మారాలో మీ దగ్గర నేర్చుకోవాలి’ అంటూ జేడీ చక్రవర్తి ట్వీట్ చేశారు.