చిరు 152వ సినిమా కొరటాలతోనే.. క్లాప్ కొట్టేశారు... - MicTv.in - Telugu News
mictv telugu

చిరు 152వ సినిమా కొరటాలతోనే.. క్లాప్ కొట్టేశారు…

October 8, 2019

chiru....

మెగాస్టార్ చిరంజీవి నటించిన 151వ చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’ విజయవంతంగా దూసుకెళ్తోంది. సినిమా ఆశించినదానికన్నా అమోఘ విజయం అందుకునేసరికి చిత్ర యూనిట్ సంబరాలు చేసుకుంటున్నారు.ఈ చిత్రం తర్వాత చిరంజీవి మళ్లీ ఎలాంటి సినిమాలో నటిస్తారని ఆయన అభిమానులు ఎదురుచూస్తుండగా చిరు వారందరి ఎదురుచూపులకు ఫుల్‌స్టాప్ పెట్టారు. తన 152వ చిత్రాన్ని దసరా సందర్భంగా పూజతో ప్రారంభించారు. కొరటాల శివ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌తో కలిసి కొణిదెల ప్రొడక్షన్స్ ఈ సినిమాను నిర్మిస్తోంది. 

దసరా పండగరోజు మంచి ముహూర్తం కావడంతో ఈ చిత్రం పూజా కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. చిరు, రామ్‌ చరణ్‌, కొరటాల శివతోపాటు చిరంజీవి మాతృమూర్తి అంజనా దేవి, సురేఖ, సుస్మిత తదితరులు పూజకు హాజరయ్యారు. చిరంజీవి సతీమణి సురేఖ ముహూర్తపు సన్నివేశానికి క్లాప్‌ కొట్టారు. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభిస్తారు. కొరటాల శివ అంటే మంచి కథాబలం వున్న సినిమానే అయివుంటుందని ఆయన అభిమానులు అంటున్నారు. మిర్చి, శ్రీమంతుడు వంటి మంచి సినిమాలను అందించిన కొరటాల శివ, చిరంజీవికి సూటయ్యే సామాజిక కథాంశంతోనే సినిమా తీస్తున్నారని చెబుతున్నారు.