Taraka Ratna : తారకరత్న మరణంపై...చిరంజీవి భావోద్వేగ ట్వీట్..ఎంతో టాలెంట్, భవిష్యత్ ఉన్న నటుడు...!! - Telugu News - Mic tv
mictv telugu

Taraka Ratna : తారకరత్న మరణంపై…చిరంజీవి భావోద్వేగ ట్వీట్..ఎంతో టాలెంట్, భవిష్యత్ ఉన్న నటుడు…!!

February 19, 2023

నటుడు నందమూరితారకరత్న శనివారం తుదిశ్వాస విడిచారు. ఆయన గుండెపోటుకు గురై 23 రోజులపటు బెంగుళూరులోని నారాయణ హృదయాలయ చికిత్స పొందుతూ…శనివారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు. 40ఏళ్ల వయస్సులో తారకరత్న అకాల మరణం నందమూరి ఫ్యామిలీలో తీవ్ర విషాదాన్ని నింపింది. నందమూరి అభిమానులు, టీడీపీ కార్యకర్తలు భావోద్వేగానికి లోనవుతున్నారు. తారకరత్న మరణంపై మెగాస్టార్ చిరంజీవి ఎమెషనల్ ట్వీట్ చేశారు. మంచి భవిష్యత్తు ఉన్న గొప్ప నటుడు ఇంత తొందరగా మనకు దూరమవ్వడం బాధాకరమన్నారు.

 

కాగా తారకరత్నభౌతికదేహాన్ని ఇవాళ ఉదయం బెంగుళూరు నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్ కు తరలించనున్నారు. ఆదివారం ఆయన నివాసంలో భౌతికదేహాన్ని ఉంచి…సోమవారం ఉదయం నుంచి అభిమానులు కడసారి చూసేందుకు తెలుగు ఫిలం ఛాంబర్ లో ఉంచనున్నారు. సోమవారం సాయంత్రం 5గంటలకు మహాప్రస్తానంలో అంత్యక్రియలు నిర్వహిస్తారని ఆయన కుటుంబ సభ్యులు తెలిపినట్లు సమాచారం.