Chiranjeevi's Godfather will be released on Netflix on November 19
mictv telugu

చిరంజీవి ‘గాడ్ ఫాదర్’ ఓటీటీ డేట్ వచ్చేసింది

November 2, 2022

మెగాస్టార్ చిరంజీవి నటించిన తాజా చిత్రం గాడ్ ఫాదర్. మలయాళ లూసిఫర్ సినిమాకు రీమేక్‌గా వచ్చిన ఈ చిత్రం మంచి కలెక్షన్లు రాబట్టింది. సీరియస్ లుక్, గాంభీర్యమైన తన నటనా ప్రావీణ్యంతో చిరు ఆకట్టుకున్నారు. తద్వారా పాటలు, డ్యాన్సులు లేని లోటును కనపడనీయకుండా చూసుకున్నారు. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలోకి రానుంది. హక్కుల కోసం ప్రముఖ ఓటీటీ సంస్థలు పోటీపడగా నెట్ ఫ్లిక్స్ ఆ హక్కులను కైవసం చేసుకుంది. ఈ మేరకు సదరు సంస్థ అప్ డేట్ ఇచ్చింది. నవంబర్ 19 నుంచి తమ ఫ్లాట్‌ఫామ్ వేదికగా రిలీజ్ చేయనున్నట్టు వెల్లడించింది. పొలిటికల్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రానికి మోహన్ రాజా దర్శకత్వం వహించగా, బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ప్రత్యేక పాత్రలో కనిపించారు. థమన్ సంగీతం ఆకట్టుకుంది.