గరికపాటిపై చిరు పరోక్ష పంచ్.. నవ్వులు పూయిస్తున్న వీడియో - MicTv.in - Telugu News
mictv telugu

గరికపాటిపై చిరు పరోక్ష పంచ్.. నవ్వులు పూయిస్తున్న వీడియో

October 29, 2022

మెగాస్టార్ చిరంజీవి, అవధాని గరికపాటి నరసింహారావు అంశం మరోసారి వార్తల్లోకెక్కింది. అయితే ఈ సారి కారణం మాత్రం మెగస్టార్ చిరంజీవే. ఆయన గరికపాటిపై పరోక్షంగా పంచ్ వేశారు. ఈ ఘటన హైదరాబాదులోని ఓ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో చోటు చేసుకుంది. సీనియర్ సినిమా జర్నలిస్ట్ ప్రభు తన గురించి రాసిన ‘శూన్యం నుంచి శిఖరాగ్రాలకు’ అనే పుస్తకాన్ని చిరంజీవి ఆవిష్కరించారు. చిరంజీవి మాట్లాడిన అనంతరం గతంలోలాగే మహిళలు ఫోటో దిగేందుకు పోటీపడ్డారు.

 

చిరంజీవికి పుష్ప గుచ్ఛం అందించి ఫోటోలు దిగేందుకు సిద్ధపడుతుండగా.. చిరంజీవి ‘ఇక్కడ వారు లేరు కదా’ అని వేలు పైకి చూపించి గరికపాటిని పరోక్షంగా గుర్తు చేశారు. దీంతో క్షణాల పాటు అందరి ముఖాల్లో నవ్వులు పూశాయి. అందరూ అలయ్ బలయ్ సంఘటనను మర్చిపోయారని భావించే లోపల చిరంజీవి సరదాగా మరోసారి గుర్తు చేయడంతో ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అంతకు ముందు మాట్లాడిన చిరంజీవి తన ఇంట్లో ఉన్న హీరోలను చూస్తుంటే కడుపు మండిపోతుందని వ్యాఖ్యానించారు. ఇప్పటితరానికి ముందు తరంలోని దిగ్గజాల గురించి తెలియట్లేదని తన సొంత మనవళ్లు, మనవరాళ్ల ముందు తన గురించి సొంత డబ్బా కొట్టుకోవాల్సి వస్తుందని వాపోయారు. తన ఎవర్ గ్రీన్ పాటలను పిల్లలకు చూపించి తన గొప్ప గురించి తానే చెప్పుకుంటున్నానన్నారు. రెండు తరాలు గడిచిపోయేసరికి దిగ్గజాలను మర్చిపోతున్నారని, అలాంటి వాళ్ల గురించి ప్రభు చెప్పడానికి పూనుకోవడం అభినందనీయమని ప్రశంసించారు.