ఇక ‘చిరు’ అల్లుడి వంతు..! - MicTv.in - Telugu News
mictv telugu

ఇక ‘చిరు’ అల్లుడి వంతు..!

September 9, 2017

 

మెగా ఫ్యామిలీ నుంచి మరో హీరో రాబోతున్నాడు. చిరంజీవి రెండో అల్లుడు కళ్యాణ్ బాబు హీరో ఎంట్రీకి రంగం సిద్ధం అవుతుందని సమాచారం. తెలుగు ఇండస్ట్రీలో  దాదాపు మెగా హీరోలే ఉన్నారు. తమ్ముళ్లు నాగబాబు, పవన్ కళ్యాణ్ హీరోలయ్యారు. చిరు కొడుకు రాం చరణ్ , మేనల్లుడు  అల్లు అర్జున్, అల్లు శిరీష్ లు, నాగబాబు కొడుకు వరుణ్, చిరు ఇంకో మేనల్లుడు సాయిధరమ్ తేజ్  హీరోలు అయ్యారు. నాగబాబు కూతురు హీరోయిన్ అయ్యింది. ఇగ రేపు రేపు పవన్ కళ్యాణ్  కొడుకు, ఆ తర్వాత ఈళ్ల కొడుకులు, ఆళ్ల ఆళ్ల కొడుకులు, అల్లుల్లు  ఇలా చెప్పుకుంటూ పోతే మెగా ఫ్యామిలీ తరతరాల హీరోల్ని చూసే భాగ్యం మెగా  అభిమానులకు  కలగబోతుందన్నమాట. ఎటువంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా కష్టపడి  మెగాస్టార్ గా చిరంజీవి ఎదిగాడు. కానీ వీళ్లు ఎటువంటి  కష్టం పడకుండానే.. తెలుగు సినిమా ఇండస్ట్రీ ఎర్ర గొంగడి పరిచి  మరీ వెల్కమ్ చెప్తుంది.  కిస్మత్ అంటే ఈళ్లదే అని అనుకుంటున్నారు  సంవత్సరాలు కొద్ది ఇండస్ట్రీలో తిరిగినా  హీరో గా కాదు కదా హీరో ఫ్రెండ్ గా కూడా అవకాశాలు దొరకని చాలామంది.