పూరీ కలను నేరవేర్చిన చిరు: ఏమిటంటే? - MicTv.in - Telugu News
mictv telugu

పూరీ కలను నేరవేర్చిన చిరు: ఏమిటంటే?

April 9, 2022

chiru

సినీ ప్రియులకు టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ అంటే తెలియని వారుండరు. ఆయన తెరకెక్కించిన సినిమాల లిస్ట్ గురించి, అవి సాధించిన విజయాల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చిన ఇస్మార్ట్ శంకర్ సినిమా ఎంతంటి విజయాన్ని సాధించిందో అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవీ పూరీ జగన్నాథ్ విషయంలో ఓ ఆసక్తికర విషయాన్ని సామాజిక మాధ్యమాల ద్వారా పంచుకున్నారు.

“వెండితెరపై నటుడిగా ఓ వెలుగు వెలగాలనే ఉద్దేశంతో నర్సంపట్నం నుంచి ఓ కుర్రాడు హైదరాబాద్ వచ్చాడు. ఒకటి, ఆరా వేషాలు వేశాడు. ఇంతలో కాలం చక్రం తిప్పింది. స్టార్ డైరెక్టర్ అయ్యాడు. కానీ, అతడి మొదటి కల అలా మిగిలిపోకూడదు కదా.. అందుకే ఇలా” అని చిరు పేర్కొన్నారు. తాజాగా చిరంజీవి నటిస్తున్న మలయాళీ ‘లూసిఫర్ రీమేక్ గా ‘గాడ్ ఫాదర్’ రూపుదిద్దుకుంటోంది. ఈ సినిమాకు మోహన్ రాజా దర్శకుడు. అయితే, పొలిటికల్ థ్రిల్లర్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. ఈ సినిమలో పూరీ జగన్నాథ్ జర్నలిస్ట్‌గా కనిపించే అవకాశం ఉన్నట్లు సమాచారం.

అయితే, చిరంజీవి మాట్లాడుతూ.. ”పూరీకి చిన్నప్పటి నుంచి సినిమా పరిశ్రమపై ఎనలేని అభిమానం. ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి పెద్ద నటుడు కావాలని ఎన్నో కలలు కన్నారు. కానీ, అనుకోని విధంగా దర్శకత్వం వైపు ఆయన అడుగులుపడ్డాయి. దర్శకుడిగా టాలీవుడ్ స్టార్ హీరోలతో మాస్ హిట్స్ తెరకెక్కించారు” అని అన్నారు. అనంతరం పూరీ కలను తెలుసుకున్న చిరంజీవి.. ఆయన కలను సాకారం చేయాలనుకున్నారు. తాను నటిస్తోన్న సరికొత్త చిత్రం ‘గాడ్ ఫాదర్’లో ఓ స్పెషల్ రోలకు పూరీని తీసుకుంటే బాగుంటుందని భావించారు.

అందుకు టీమ్ కూడా ఓకే అనడంతో, పూరీ జగన్నాథ్ ఈ సినిమాలో భాగమయ్యారు. అలా, ఆయన శనివారం ఉదయం ‘గాడ్ ఫాదర్ సెట్ లోకి అడుగు పెట్టారు. లేటస్ట్ షెడ్యూల్‌లో ఆయనపై సన్నివేశాలు చిత్రీకరించనున్నారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ చిరు ట్విట్ చేశారు.