సీఎంను హెచ్చరించిన దళిత మహిళ ఇంట్లో ఘోరం.. - MicTv.in - Telugu News
mictv telugu

సీఎంను హెచ్చరించిన దళిత మహిళ ఇంట్లో ఘోరం..

April 14, 2018

కేరళలోని లెఫ్ట్ ఫ్రంట్ ప్రభుత్వంతో అమీతుమీ అన్నట్లు పోరాడుతున్న దళిత మహిళా డ్రైవర్ చిత్రలేఖ ఇంట్లో గుర్తుతెలియని వ్యక్తుల హేయమైన చర్యలకు పాల్పడ్డారు. చచ్చిపోయిన కుక్కను నిర్మాణదశలో ఉన్న ఆమె ఇంట్లో పడేసి పోయారు. సీపీఎం కార్యకర్తలు తనను వేధిస్తూపోతే సీఎం పినరయి విజయన్ తన శవాన్ని తినాల్సిన పరిస్థితి వస్తుందని చిత్రలేఖ హెచ్చరించిన నేపథ్యంలో గురువారం కుక్క కళేబరాన్ని ఆమె ఇంట్లో వదిలారు.ఎడాట్‌లోని ఆటోస్టాండ్‌ను వాడుకోవద్దని చిత్రలేఖను సీపీఎం అనుబంధం కార్మిక సంస్థ సీఐటీయూ కార్యకర్తలు బెదిరిస్తున్నారు. కలం పేరుతో దూషిస్తున్నారు. అసభ్యంగా మాట్లాడుతున్నారు. ఆమె ఈ వివక్షకు వ్యతిరేకంగా పోరాడుతోంది. దీంతో ఎర్రసర్కారు ఆమెపై కన్నెర్రజేసింది. గత యూడీఎఫ్ ప్రభుత్వం ఆమెకు కేటాయించిన 5 సెంట్ల స్థలం పట్టాను రద్దుచేసింది. ఆ స్థలంలో ఆమె ఇప్పటికే ఇంటి నిర్మాణం మొదలుపెట్టింది. సీపీఎం కార్యకర్తల నుంచి తనకు ప్రాణహాని ఉందని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసిన ఫలితం లేకుండాపోతుంది. తమకు రక్షణ కల్పించాలని ఆమె గతంలో హైకోర్టును కూడా కోరింది.