రేపిస్ట్ రఫీకి ఉరిశిక్ష.. వర్షిత కేసులో కోర్టు తీర్పు  - MicTv.in - Telugu News
mictv telugu

రేపిస్ట్ రఫీకి ఉరిశిక్ష.. వర్షిత కేసులో కోర్టు తీర్పు 

February 24, 2020

Chittoor court death sentence to varshita case convict rafi

సంచలనం సృష్టించిన వర్షిత హత్యాచారం కేసులో చిత్తూరు కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. మహ్మద్ రఫీని దోషిగా తేల్చి ఉరిశిక్ష విధించింది. తీర్పు ప్రతిని హైకోర్టుకు పంపుతామని, ఎప్పుడు ఉరి తీయాలో ఆ కోర్టే చెబుతుందని తెలిపింది.  చిత్తూరు జిల్లాలో ‘పోక్సో’ కేసులో దోషికి ఉరిశిక్ష పడటం ఇదే తొలిసారి. 

గత ఏడాది నవంబర్‌లోరు కురబల కోట మండలం చేనేతవారి వీధికి చెందిన వర్షిత తల్లిదండ్రులతో కలిసి పెళ్ళికి వెళ్ళింది.  మదనపల్లె మండలం బసినికొండకు రఫీ ఆ చిన్నారికి చాక్లెట్ ఇస్తానని చెప్పి తీసుకెళ్లి దారుణానికి పాల్పడ్డాడు. అత్యాచారం తర్వాత చంపేసి పారిపోయాడు. సీసీ ఫుటేజ్ ఆధారంగా  పోలీసులు నిందుతుడిని లారీ క్లీనర్ రఫీగా గుర్తించారు. రఫీ ఛత్తీస్‌గఢ్‌కు పారిపోయి తనను పోలీసులు గుర్తుపట్టకుండా గుండు గీయించుకున్నాడు. పోలీసులు పకడ్బందీగా నిఘా పెట్టి అతణ్ని పట్టుకున్నారు. రఫీ గతంలోనూ పలువురు చిన్నారులపై అత్యాచారానికి పాల్పడినట్లు చార్జిషీటులో పేర్కొన్నారు. ఓ కేసులో రెండు నెలలు జైల్లో కూడా గడిపిన రఫీ.. అభం శుభం తెలియని చిన్నారులను టార్గెట్ చేసుకున్నారు.