మాజీ ఎంపీ, టీడీపీ నేత శివప్రసాద్ కన్నుమూత - MicTv.in - Telugu News
mictv telugu

మాజీ ఎంపీ, టీడీపీ నేత శివప్రసాద్ కన్నుమూత

September 21, 2019

Chittoor ex mp shiva prasad passed away.

ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ టీడీపీ సీనియర్ నేత కోడెల శివప్రసాద్ ఆత్మహత్య చేసుకొని వారం రోజులు కూడా కాకముందే మరో టీడీపీ నేత చిత్తూరు మాజీ ఎంపీ శివ ప్రసాద్ అనారోగ్యంతో మృతిచెందారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చిత్తూరులో చికిత్స పొందుతున్నారు. అయితే, ఇటీవల ఆరోగ్యం విషమించడంతో కుటుంబసభ్యులు ఆయనను చెన్నైలోని అపోలో ఆస్పత్రికి తరలించారు. కాగా, ఈరోజు కన్నుమూశారు. 

శివప్రసాద్ 2009, 2014 ఎన్నికల్లో వరుసగా రెండుసార్లు చిత్తూరు లోక్‌సభ స్థానం నుంచి టీడీపీ తరఫున పోటీ చేసి విజయం సాధించారు. 2019 సావిత్రిక ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి రెడ్డప్ప చేతిలో ఓటమి పాలయ్యారు. స్వతహాగా సినీ దర్శకుడు, నటుడైన శివప్రసాద్ తన నిరసనలను కూడా అదే రీతిలో తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి న్యాయం చేయాలని, ప్రత్యేక హోదా ప్రకటించాలని పార్లమెంట్ సమావేశాలు జరిగిన ప్రతిసారీ రకరకాల వేషధారణల్లో నిరసనలు తెలిపేవారు.